సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఓవర్ నైట్ లో స్టార్ అవుతారో.. ఎప్పుడు ఎవరు ఎలా ఫేడవుట్ అవుతారో ఎవరూ చెప్పలేదు. వీళ్ళలో ఎక్కువమంది టాలెంట్ ఉండి మంచి సక్సస్ లను చూసిన వాళ్ళే ఎక్కువగా కనుమరుగైపోతుంటారు. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయినా మరో డిజాస్టర్ అయితే చాలు ఇక ఆ హీరోయిన్ తీసి పక్కన పెట్టేస్తారు. ఉదాహరణకి కియారా అద్వానీ మాదిరిగా. ఈ బ్యూటి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన మొదటి సినిమా భర్త్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్. అంతే ఈ దెబ్బతో కియారా మళ్ళీ తెలుగులో కనిపించలేదు. అయితే బాలీవుడ్ లో సక్సస్ అయింది కాబట్టి కనిపిస్తుంది పేరు వినిపిస్తుంది. లేదంటే ఇప్పటికే కియారా ని అందరు మర్చిపోయో వాళ్ళు. ఇలాంటి వళ్ళు మన దగ్గర చాలామందే ఉన్నారు.

 

ప్రగ్యాజైశ్వాల్.. 2014లో 'డేగ' సినిమాతో ఒకేసారి తెలుగు- తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తీసిన 'కంచె' సినిమాతో మంచి పేరే వచ్చింది.కాని 
'ఓం నమో వెంకటేశాయ'.. 'గుంటూరోడు'.. 'నక్షత్రం' సినిమాలు డిజాస్టర్ అవడంతో అడ్రెస్ లేకుండా పోయింది. 2018లో నటించిన 'ఆచార్య అమెరికా యాత్ర' కూడా ప్రగ్యాని అఘాతంలోకి నెట్టేసింది. ఇక 2010లో వచ్చిన 'లీడర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత 'మిరపకాయ్' 'నాగవల్లి' 'సారొచ్చారు' 'మిర్చి' 'భాయ్' సినిమాలలో నటించింది. విటిలో ఒక్క మిరపకాయ్ తప్ప మిగతా సినిమాలేవి రిచా కి పేరు తేలేదు. అంతే 'భాయ్' తర్వాత ఇంటికెళ్ళిపోయింది.

 

2010లో 'వేదం' సినిమాతో దీక్షా సేత్ ని టాలీవుడ్ కి తీసుకు వచ్చాడు క్రిష్. 'మిరపకాయ్' 'వాంటెడ్'.. 'నిప్పు'.. 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'.. 'రెబెల్' సినిమాలు చేసింది. చేసినవన్ని పెద్ద సినిమాలే అయినా అవన్ని ఫ్లాపవడం తో దీక్షా సేత్ ని దేకిన వాళ్ళు లేరు. బాలీవుడ్ లో ట్రై చేసిన పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రేమ కథా చిత్రమ్ నందిత...పవన్ కళ్యాణ్ సరసన పులి సినిమా ద్వారా టాలీవుడ్ కి వచ్చిన నికిషా పటేల్, శ్రీదివ్య ..ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే. ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా అది పోతే ఇక ఇంటికే పరిమితమవుతున్నారు. అలా వచ్చి ఇలా కనుమరుగవుతున్న ఈ హీరోయిన్స్ కొంతమంది అటు సినిమాలలో లక్కు కలిసి రాక ఇండస్ట్రీలో వీళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక తప్పని పరిస్థితుల్లో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇదే అదును చూసుకొని కొంతమంది వీళ్ళని పలానా పనికి అలవటు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: