కరోనా భయంతో ప్రపంచమంతా వణికిపోతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారి కారణంగా స్తంభించిపోయాయి. ఇప్పటికే దాదాపు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలంటూ విన్నవిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలు ప్రజలు తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. సెలబ్రిటీ లంతా సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌ పేరుతో చేతులు కడుక్కునే వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషీ కపూర్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. `పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా తమ దేశ ప్రజలకు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పాలని కోరారు. పాకిస్తాన్ ప్రజలు కూడా మాకు ప్రియమైన వారే. ఒకప్పుడు మనమంతా ఒకటే. మీ మీద కూడా మాకు జాలి ఉంది. ఇది అంతర్జాతీయ విపత్తు. ఇందులో ఈగో ఏం లేదు. మానవత్వం వర్థిల్లాలి` అంటూ కామెంట్ చేశాడు రిషి కపూర్‌.

 

అయితే ఈ పోస్ట్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది రిషీ కపూర్‌కు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ను విమర్శిస్తున్నారు. `సార్‌ 3 పెగ్గుల కంటే ఎక్కువ తాగకండి` అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు ఓ నెటిజెన్‌. మరికొందరు మాత్రం `ఇది కష్టకాలం ఇప్పుడు ద్వేశం చూపించకూడాదు` అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గతంలోనూ రిషి కపూర్ చేసిన పలు ట్వీట్లు విమర్శల పాలైయ్యాయి. చాలా కాలంగా క్యాన్సర్ కారణంగా విదేశాల్లోనే ఉన్న రిషీ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: