ఈ మధ్య సినిమాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీసుని ఏలుతున్నాయి. అందుకే మన సినిమాల్లో చాలా మార్పు కనిపిస్తోంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం తమ కథల్ని కొత్తగా చెప్పడానికి రెడీ అవుతున్నారు. అయితే సినిమా అనేది వ్యాపారం. ఎంత క్రియేటివిటీ ఫీల్డ్ అయినా కూడా ఇక్కడ సినిమాలు తీసేది డబ్బులు సంపాదించడానికే.

 

 

సినిమా తీసేసి డబ్బులు రాకపోతే నిర్మాత మరో సినిమా చేయడానికి ముందుకు రాడు. ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణ రంగంలో మార్పులు వచ్చాయి. ఒక సినిమాకి ఒకరే నిర్మాతగా ఉండడం కంటే మరొకరిని భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా లాభమైనా, నష్టమైనా సమానంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో సంయుక్త నిర్మాణంం చేపడుతున్నారు. పెద్ద స్టార్లు వారే నిర్మాతలుగా మారి తమ సినిమాలకి డబ్బులు పెట్టడం చూస్తున్నాం.

 

 

ఈ కోవలోకి మహేష్ బాబు, ప్రభాస్ చేరిపోయారు. మహేష్ బాబు తనతో చేసే ఏ సినిమాలో అయినా కొంతభాగం డబ్బు పెడుతుంటాడు. దీనివల్ల ఆర్థిక భారం ఎక్కువగా నిర్మాత మీద పడకుండా ఉంటుంది. తద్వారా భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ బాటలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోతున్నాడు. ఎన్టీఆర్ తర్వాతి చిత్రం త్రివిక్రమ్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 

 

 

ఈ సినిమాని హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కళ్యాణ్ రామ్ కి చెందినదె అయినా ఎన్టీఆర్ కూడా దీనిలో డబ్బులు పెడుతున్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారుతున్నాడట. త్వరలో ఓ నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసే ఆలోచన కూడా ఉందట.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: