ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే. అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. ఇంకా అలాంటి కరోనా వైరస్ తరిమికొట్టడానికి ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు ఆదివారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇక అలాంటి కర్ఫ్యూ విధించిన రోజు ఏ ఒక్కరు కూడా బయటకు రాకూడదు. ఇంట్లోనే ఉండాలి. అయితే అలాంటి కర్ఫ్యూ విధించిన ముందు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పనులు చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కర్ఫ్యూ రేపు విధిస్తున్నారు కనుక ముందురోజు అంటే ఈరోజు.. ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు అన్ని కూడా ముందుగానే తీసి పెట్టుకోండి. 

 

ఇంకా కొందరు ఆరోగ్య పరిస్థితుల ప్రకారం కావాల్సిన మందులు ఉన్నాయో లేవో చూసుకొని ఈరోజే తెచ్చుకోండి. 

 

పిల్లలను బయటకు పంపకుండా.. పిల్లలకు కావలసిన ఆహారపదార్ధాలు అన్ని కూడా ముందుగానే తెచ్చుకోండి. 

 

ఆదివారం చెయ్యాలి అని ప్లాన్ చేసుకున్న పనులు అన్ని కూడా వాయిదా వేసుకోవడం ఎంతోమంచిది. లేదు అంటే ఈరోజు సాయింత్రమే ఆ పనులు పూర్తి చేసుకోండి. 

 

అంతేకాదు.. కర్ఫ్యూ అని చెప్పి బంధువులను అంత ఇంటికి ఆహ్వానించకండి.. వీలైనంత తక్కువ మంది ఇంట్లో ఉండేలా చూసుకోండి. 

 

ఇంకా అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఉగాది పండుగకు ఇల్లు క్లీన్ చేస్తారు కాబట్టి కుదిరితే మీరు సహాయపడండి. 

 

రేపు ఏ మెడికల్ షాప్స్ తెరిచి ఉండవు కాబట్టి ఈరోజే పారాసెటమాల్ టాబ్లెట్ ఒక స్ట్రిప్ తీసుకోని మీదగ్గర పెట్టుకోండి. 

 

ఎట్టిపరిస్థితుల్లో బయట నుండి ఫుడ్ ఆర్డర్ చెయ్యకండి.. కొంచం ఓపిక తెచ్చుకొని యూట్యూబ్ పెట్టుకొని వంటలు చేసుకొని ఎలా ఉన్న తినేయండి. 

 

ఇంకా ఇంట్లోనే మీరు ఉపయోగించే అన్ని వస్తువులు శుభ్రంగా డెటాల్ తో క్లిన్ చెయ్యండి. 

 

బిజినెస్ పనుల.. ఆఫీస్ పనులు.. స్కూల్స్.. కాలేజెస్ కారణంగా ఎప్పుడు బిజీ బిజీ ఉండే కుటుంబం అంత ఈ జనతా కర్ఫ్యూ వల్ల 14 గంటలు కలిసి ఉంటారు కాబట్టి ఆనందంగా ఇంట్లోనే గడపండి..

 

కేవలం శాకాహారం మాత్రమే తినండి.. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకండి. 

 

పైన చెప్పిన అన్ని చిట్కాలు పాటించి ''జనతా కర్ఫ్యూ''ను విజయవంతం చేయండి. కరోనా వైరస్ ను తరిమికొట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: