సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి డైరెక్టర్ వరకు ప్రతీ ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి. ఫలానా ఆర్టిస్టు నా సినిమాలో ఉంటే సెంటిమెంట్ అనో, ఫలానా సింగర్ తో పాడిస్తే బాగుంటుందనో, ఒకానొక లొకేషన్ లో షూటింగ్ పెట్టుకుంటే సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందనో, లేదా ఫలానా హీరోయిన్ అన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయన్న కారణంగా మళ్లీ ఆమెకే ఛాన్స్ ఇవ్వడం లాంటివి తరచుగా జరుగుతుంటాయి.

 

సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి సెంటిమెంట్లు తర్కానికి నిలబడకపోయినా పోయేదేమీ లేదన్న ఉద్దేశ్యంతో ఫాలో అయిపోతుంటారు. అయితే తాజాగా ఈ సెంటిమెంటులు ఉన్నవారి లిస్ట్ లో దర్శకుడు సుకుమార్ కూడా చేరిపోయినట్టుగా అనిపిస్తుంది. సుకుమార్ సినిమాలు ఎంత బ్రిలియన్స్ గా ఉంతాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు.

 

 

ఈ సినిమాలో సుకుమార్ ఒక సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడట. నాన్నకు ప్రెమతో సినిమా నుండి సుకుమార్ సినిమాలని చూసుకుంటే ప్రతీ సినిమాలో హీరోకి గడ్డం ఉంటుంది. గుబురు గడ్డంతో కొంచెం రాష్ గా కనిపిస్తారు. నాన్నకు ప్రేమతో మొదలుకుని, రంగస్థలం వరకు అలాగే కనిపించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే లుక్ లో కనిపిస్తాడట. గుబురు గడ్డంతో ఊరమాస్ లుక్ లో అల్లు అర్జున్ దర్శనమిస్తాడట.

 

ప్రస్తుతానికి లుక్ టెస్ట్ జరుగుతుందని సమాచారం. మొన్న రివీల్ అయిన ఫోటోలో అల్లు అర్జున్ గుబురు గడ్డంతో చాలా స్టైలిష్ గా కనిపించాడు. లారీ డ్రైవర్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ చిత్తూరు యాసని మాట్లాడతాడట. గుబురు గడ్డం సెంటిమెంట్ సుకుమార్ మరికొన్ని రోజులు వదిలేలా లేడు. గమ్మత్తయిన విషయం ఏంటంటే సుకుమార్ సినిమాల్లో హీరోలకే కాదు సుకుమార్ కూడా గుబురు గడ్డంలోనే ఎక్కువగా కనిపిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: