కరోనా కరాళ నృత్యంతో జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమిత మవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఇండియాలో పరిస్థితులు చక్కబడే వరకు తాను ఇండియాకు రానని చెప్పాడు. ప్రస్తుతం సోను నిగమ్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ లో ఉన్నాడు. అక్కడే ఆయన కుటుంబం అంతా సెల్ఫ్ క్వారెంటైన్‌ లో ఉన్నారు.

 

ఈ సందర్భంగా సోనూ ఓ ప్రకటన విడుదల చేశాడు.. `నేను మార్చి 5 వరకు హిమాలయాలలో ఉన్నాను. తరువాత ముంబైలో జరగాల్సిన ఓ కన్సర్ట్ వాయిదా పడటంతో నేను కుటుంబంతో కలిసి ఉండాలని దుబాయ్‌కి వచ్చాను. మార్చి 17న దుబాయ్‌ కి చేరుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడే వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి వచ్చి క్వారెంటైన్‌ లో ఇరుక్కోలేను. ఇప్పటికే అధికారులకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నేను వారిక అదనపు బరువు కాలేను` అంటూ సోనూ కామెంట్ చేశాడు.

 

అంతేకాదు `నాకు నా తండ్రి, సోదరిలతో కలిసి ఉండటం చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను వారిని కలవటం వాళ్లకు ప్రమాదం. ఇప్పటికే నేను దుబాయ్‌ తో పాటు ముంబై ఎయిర్‌ పోర్ట్‌ లో తిరిగాను. అందుకే వారికి దూరంగా ఉంటాను. నా కుమారుడు దుబాయ్‌ లో చదువుతున్నాడు. తన స్కూల్‌ కు కూడా సెలవులు ప్రకటించారు. ఇప్పుడు వాడితో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నా. అత్యంత అవసరం అయితే తప్ప బయటకు వెళ్లటం లేదు. శుభ్రత పాటిచటంతో పాటు ఇతరులకు దూరంగా ఉండటం ఈ పరిస్థితిల్లో ఎంతో మంచిది` అంటున్నాడు సోనూ నిగమ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: