అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన నాగచైతన్య ప్రస్తుతం మంచి సక్సెస్ రేటు తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తన తనదైన నటనతో కూడా అదరగొడుతు ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకున్నారు నాగ చైతన్య. వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని వారసుడిగా అభిమానులకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. గత సంవత్సరం మజిలీ సినిమాలో సమంతతో రీల్ లైఫ్లో జోడి కట్టి  అద్భుతమైన నటనతో ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి యూత్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండగా .. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది. సున్నితమైన ప్రేమ కథా చిత్రాలను తనదైన స్టైల్లో తెరకెక్కించి  ఈ ఫ్యామిలీ ఆడియన్స్ మెస్మరైస్ చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల... ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగచైతన్య తో సినిమా అంటే కాస్త అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక లవ్ స్టోరీ లో నాగచైతన్య  యువకుడుగా కనిపిస్తాడు  అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఫిదా సెన్సేషనల్ హిట్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రస్తుతం శేఖర్ కమ్ముల  లవ్ స్టోరీ సినిమా చేస్తుండడంతో సినిమాపై మరింత హైప్  పెరిగిపోయింది. 

 

 

 గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో అదరగొట్టిన సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో నటిస్తుంది . అయితే వీరిద్దరి కాంబినేషన్ మొదటి సారి కావడం గమనార్హం. అయితే సాయి పల్లవి అంటే నటన పీక్స్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సన్నివేశంలో అయినా  జీవించి మరి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది సాయి పల్లవి. మరి సాయి పల్లవి నటనను నాగచైతన్య అందుకోగలడ  అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో డౌట్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఏకంగా తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నడట. అయితే గత మజిలీ సినిమాలోని నాగచైతన్య నటన పరంగా మంచి మార్కులు వేసుకున్నాడు... ఇక ఈ సినిమా కోసం తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం రెడీ అవుతున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో కూడా సాయి పల్లవి నాగ చైతన్య ముద్దు పెట్టుకున్నప్పుడు చైతు చూపించిన హావభావాలు అందరిని ఫిదా చేసాయి అని చెప్పాలి. దీంతో ఈ సినిమాలో సాయి పల్లవి ని మించి నాగచైతన్య యాక్టింగ్ ఉండబోతుందని సినీ విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: