ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించినవ్యాప్తి రోజు రోజు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..

 

 


ఇప్పటికే కొందరు సినీ తారలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. 

 

 


కరోనా వైరస్ ప్రభావం విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెలెబ్రెటీలు అభిమానులకు అవగాహన తెలియజేస్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ లోని ప్రముఖులైన నటులు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, అజయ్ దేవగన్, శిల్పాశెట్టి, వరుణ్ ధావన్ తదితరులు కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ  వీడియోను చేశారు. 

 

 


సూపర్ స్టార్ అమితా బచ్చన్ ఈ వీడియో ను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న 15 రోజులు కరోనా ప్రభావం మరీంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఎక్కడికి వెళ్లకుండా ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: