టాలీవుడ్ లోకి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున, సోనూ సూద్ ముఖ్య పాత్రలో ‘సూపర్ ’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క శెట్టి.  బెంగుళూరు లో యోగా టీచర్ గా ఉన్న అనుష్క ‘సూపర్’ మూవీతో మంచి సక్సెస్ సాధించింది.  ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు అనుష్కకు అదే స్థాయిలో పేరు తెచ్చుకుంది.  అరుంధతి మూవీ తర్వాత అనుష్క నటించిన రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి మూవీస్ లాంటి లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి మెప్పించింది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2’ లో అనుష్క నటనకు విమర్శకుల నుంచిప్రశంసలు దక్కాయి.

 

 బాహుబలి లో డీ గ్లామర్ గా నటించిన అనుష్క .. బహుబలి 2 లో మహరాణిగా మెప్పించారు.  సినీ పరిశ్రమలో ఒక జంట వరుసగా కలిసి నటిస్తే.. ఆ జోడీ కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయితే వారి మద్య ఖచ్చితంగా ఎఫైర్స్ నడుస్తున్నాయని ఫిలీమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీన్ని మీడియాలో పెద్ద భూతద్దంలో చూపించడం కామన్.  ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీలో నటిస్తుంది. ఈ సందర్భంగా ఓ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తనకంటూ సొంత జీవితం ఉంటుందని, ఇందులో కొందరు కల్పించుకుంటుండటం తనకు నచ్చడం లేదని చెప్పింది.తన ప్రేమ, పెళ్లి గురించి కొందరు ఎన్నో ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారని అనుష్క తెలిపింది.

 

2008లో తానూ ప్రేమలో పడినట్లు, అదో తీయని ప్రేమ అని చెప్పింది. అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయామని తెలిపింది. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని తాను చెప్పబోనని పేర్కొంది.   ప్రభాస్‌తో స్నేహాన్ని వదులుకుంటారా? సినిమాల్లో యాక్టింగ్‌ వదులుకుంటారా’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు  సినిమాల్లో యాక్టింగ్‌ వదులుకుంటా కానీ.. కెరీర్ కోసం మంచి స్నేహాన్ని మాత్రం వదులుకోలేను.  నాకు రెండూ ముఖ్యమే అన్నారు అనుష్క. 

మరింత సమాచారం తెలుసుకోండి: