సింగర్ కనికా కపూర్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రపంచ మంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమిత మవుతుంటే కనికా మాత్రం విదేశాల నుంచి తిరిగి వచ్చి పలువురు ప్రముఖలతో కలిసి పార్టీల్లో పాల్గొంది, కనికాతో పాటు పార్టీలో పాల్గొన్న ఎంపీ పార్లమెంట్‌ కు హాజరు కావటంతో పాటు ఏకం గా రాష్ట్రపతిని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె మీద ప్రముఖులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా విదేశాల నుంచి వస్తున్న వారు ఇంట్లోనే ఉండాలన్న సూచనలు చేస్తున్న ఆమె బాధ్యత లేకుండా ప్రవర్తించటం పై ఫైర్ అవుతున్నారు.

 

అయితే కనికా కపూర్‌ చేసిన పని మరో సెలబ్రిటీ కనికా ధిల్లాన్‌ కు తల నొప్పిగా మారింది. కనికా కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్న నెటిజెన్లు కనికా ధిల్లాన్‌ను ట్యాగ్ చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కనికా థిల్లాన్‌.. సూరజ్‌ కుమార్ అనే ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌పై స్పందించింది. ఆ వ్యక్తి `వైరస్‌ ప్రభావంతో ఇంతలా ఉంటే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కనికాను అరెస్ట్ చేయాలి` అంటూ ట్వీట్ చేశాడు సూరజ్ కుమార్. ఈ ట్వీట్ ను కనికా కపూర్‌కు బధులుగా కనికా ధిల్లాన్‌కు ట్యాగ్ చేశాడు.

 

అయితే ట్వీట్‌ పై స్పందించిన కనికా థిల్లాన్‌.. `సర్‌.. వైరస్‌ మీ బుర్రలో ఉంది. అందరు కనికలను తీసుకెళ్లి జైల్లో వేస్తారా..? పేరులో సూర్యుడు ఉన్నాడు కానీ.. బుర్రలో అంతా చీకటే ఉంది. ఆలోచించి మాట్లాడండి. చేతులు కడుక్కోండి. ఇంట్లోనే ఉండండి.` అంటూ ట్వీట్ చేసింది. కనికా థిల్లాన్‌ మరెవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ మాజీ భార్యే ఈ కనికా థిల్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: