తెలుగు చిత్ర పరిశ్రమ లో  అనుష్క శెట్టి కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలో మెరిసి తన నటనతో అందంతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ... ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ... దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ లో అనుష్క పెళ్లి గురించి హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే. అనుష్క ప్రభాస్ ని ప్రేమిస్తుందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు  అని కొన్ని రోజులు వార్తలు వస్తే... ఒక ప్రముఖ క్రికెటర్ తో అనుష్క ప్రేమలో పడిందట కొన్ని రోజులు వార్తలు హల్ చల్ చేశాయి. ఇలా అనుష్క పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు  వస్తూనే ఉంది. 

 

 

 అయితే ప్రస్తుతం అనుష్క హీరోయిన్ గా  లేడీ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కిన చిత్రం నిశ్శబ్దం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్కసినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూ కి  హాజరైన అనుష్క  పలు విషయాల గురించి చెబుతుంది. ముఖ్యంగా తన ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చింది. తనకంటూ ఒక సొంత జీవితం ఉంటుంది అంటూ తెలిపిన అనుష్క దీంట్లో... కొంతమంది కల్పించుకోవడం తనకు నచ్చడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. తన ప్రేమ గురించి పెళ్లి గురించి ఎన్నో ప్రచారాలు సోషల్ మీడియాలో వస్తున్నాయంటూ ఈ సందర్భంగా తెలిపింది అనుష్క. 

 

 

 అయితే 2008లో తాను ప్రేమలో పడినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది అనుష్క. అదో తీపి జ్ఞాపకం అని... స్వీట్ లవ్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా నేను ప్రేమించిన వ్యక్తితో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. అయితే 2008లో తాను ప్రేమలో పడ్డాను అనే విషయాలను వెల్లడించిన అనుష్క తాను ప్రేమించిన వ్యక్తి ఎవరు అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అతని పేరు చెప్పను అంటూ తెలిపింది. అయితే తాను ప్రభాస్ ప్రేమించుకుంటున్నాము  అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని  అంటూ  తెలిపింది అనుష్క.. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని... మా మధ్య లవ్వు గివ్వు ఏమీ లేదంటూ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ ఇద్దరి పలుమార్లు మేము  మంచి స్నేహితులం  మాత్రమే అని చెప్పినప్పటికీ ప్రేక్షకులు మాత్రం వీళ్ల పెళ్లికి సంబంధించి ప్రచారం మాత్రం ఆపడం  లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: