అనుష్క చక్కటి నటి. అనేక సినిమాలలో నటించి ఆమె మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా  బాహుబలి సినిమాతో ఊహించని స్థానం అందుకుంది. జేజమ్మ స్వీట్ గా ఉండే స్వభావం. అయితే ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై మండిపడినట్టే కనపడుతోంది. ఆడవాళ్ళకి రక్షణ లేదు అంది. కేవలం బయట లేదా సినిమాల గురించి చెప్పడం లేదంది.

 

ఆడవాళ్ళకి ఎక్కడ కూడా రక్షణ లేదు అని స్వీటీ చెప్పింది. అయితే ఇలా అయితే కష్టమని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ లో ఎక్కడగా వట్టి మీటు మాత్రమే కాదు క్యాస్టింగ్ కౌచ్ పై కూడా అనేక చర్చలు వినపడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఎంతో మందికి అన్యాయం జరుగుతోంది. వారు కూడా వచ్చి చెప్పుకుంటున్నారు అని అంది.

 

అయితే నిజంగా ఇది ఘోరమే. ఆడవారికి అన్యాయం జరిగి వివిధ వేధింపులకు గురి అవ్వడం ఏ మాత్రం మంచిది కాదు. ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ లేదని కాదు అని అనడంతో ఉందని ఒప్పుకున్నట్టు అనడం జరిగింది అనే అంటోంది కదా అని అంటున్నారు ఫ్యాన్స్. ఏ ఫీల్డ్ అయన సరే ఆడవాళ్ళకి వేధింపులు ఉంటూనే ఉంటాయి అని చెప్పు కొచ్చింది అనుష్క. 

 

తన వరకు ఇటువంటివి ఎదుర్కొనే సమస్య ఏమి ఇప్పటి దాక రాలేదు అని చెప్పింది అనుష్క శెట్టి. మీటు విషయాలు కానీ క్యాస్టింగ్ కౌచ్ కానీ  తాను ఎదుర్కోలేదని చెప్పింది అనుష్క. తనకి ఇష్టం లేకుండా ఉంటే ఆ అమ్మాయిని పదే బలవంతంగా  ప్రశ్నలు అడగడం మంచిది కాదు అని చెప్పింది. అలానే అమ్మాయలు నో చెప్పాలంటూ ఆమె చెప్పుకొచ్చింది. పురుషులు కూడా స్త్రీలని గౌరవించడం ప్రారంభం చెయ్యాలి అని అంది.   ఇప్పుడు నిశ్శబ్దం సినిమాతో రెడీ అవుతోంది హీరోయిన్ అనుష్క శెట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: