ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది.  తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ జంటగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  వాస్తవానికి ఈ మూవీ మొదట బోల్డ్ కంటెంట్ తో ఉందని.. ఇందులో హీరోయిన్ విచ్చలవిడిగా స్కిన్ షో చేసిందని వార్తలు వచ్చాయి.  దాంతో పాటే లవ్ యాంగిల్ ని డిఫరెంట్ గా చూపించారని ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ నెగిటీవ్ షేడ్ లో నటించింది.  ఆ తర్వాత ఆర్ డీఎక్స్ లవ్ సినిమాలో నటించింది. ఇందులో కూడా పాయల్ రాజ్ పూత్ స్కిన్ షో తో ఆకట్టుకుంది. కానీ మూవీ మాత్రం కమర్షియల్ హిట్ కాలేదు.

 

తాజాగా ఈ రెండు మూల ప్రభావంతో పాయల్ కి ఐటమ్ సాంగ్ ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన ‘సీత’ మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించి పాయల్.  అయితే బోల్డ్ యాక్టర్ ముద్ర పడ్డ ఈ అమ్మడు దాన్ని తొలగించుకునేందుకు నానా తంటాలు పడుతుంది.  పాయల్ ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్లో మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తుంది. అయితే ఈ భామపై టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ వార్త బాగా హల్‌చల్ చేస్తుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ఒక హీరోయిన్‌గా పాయల్ రాజపుత్ సెలక్ట్ అయ్యిందని, త్వరలోనే ఈ భామ ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అవుతుందనేది వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

 

దాంతో పాయల్ రాజ్ పూత్ స్పందించింది. ఈ వార్తను ఆమె రూమర్‌గా కొట్టిపారేశారు. అందరికీ నమస్కారం. నేను చేస్తున్న సినిమాల గురించి క్లారిటీ ఇస్తున్నాను. నేను ఇప్పటి వరకు కొత్తగా ఏ సినిమాని అంగీకరించలేదు. అలాగే బాలకృష్ణ సార్ చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజంలేదు. గమనించగలరు. అందరికీ ధన్యవాదాలు..’’ అని పాయల్  పోస్ట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: