హీరోలు ఎవరైనా కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తారు. సక్సెస్ రేట్ లో బెంచ్ మార్క్ సెట్ చేస్తారు. కానీ రణ్ బీర్ కపూర్ మాత్రం బ్రేకప్స్ లో రికార్డులు సృష్టిస్తున్నాడు. మేకప్ వేసుకున్నంత ఈజీగా కటీఫ్ చెబుతున్నాడు. కొత్త లవ్ కు కూడా టాటా చెప్పి.. బ్రేకప్ స్టార్ గా మారుతున్నాడు రణ్ బీర్. 

 

రణ్ బీర్ కపూర్ మళ్లీ సింగిల్ గా మారుతున్నాడట. లవర్ ఆలియా భట్ కు బ్రేకప్ చెప్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. మూడేళ్లుగా ప్రేమించుకుంటోన్న రణ్ బీర్, ఆలియా విడిపోతున్నారని ముంబయి జనాలంతా చెప్పుకుంటున్నారు. పెళ్లి వరకు వెళ్లిన వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయని.. లవ్ జర్నీకి బ్రేకులు పడుతున్నాయని చెబుతున్నారు. 

 

రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాక దీపిక పదుకొనే ప్రేమలో పడ్డాడు. దీపిక అయితే రణ్ బీర్ పేరుని పచ్చబొట్టు కూడా వేసుకుంది. అయితే టాటూ బాధని భరించిన, రణ్ బీర్ అతిప్రేమను ఫేస్ చేయలేకపోయింది. రణ్ బీర్ కపూర్ కు కటీఫ్ చెప్పి కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసింది. 

 

దీపిక పదుకొనేతో బ్రేకప్ తర్వాత కత్రీన కైఫ్ కు దగ్గరయ్యాడు రణ్ బీర్ కపూర్. వీళ్లిద్దరు లండన్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ లవ్ ని కూడా ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోయాడు రణ్ బీర్ కపూర్. అతి ప్రేమతో కత్రినకు కటీఫ్ చెప్పాడు. 

 

కత్రీనా కైఫ్ తో విడిపోయాక బ్రహ్మాస్త్ర సెట్ లో ఆలియా భట్ ను కలిశాడు. అప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రతో విడిపోయన ఆలియా.. రణ్ బీర్ నేచర్ కు పడిపోయింది. కానీ ఈ కేరింగే ప్రమాదంగా మారిందని కపూర్ కు దూరంగా ఉంటోందట ఆలియా. మరి ఇంతమంది అమ్మాయిలు రణ్ బీర్ ని పక్కనపెడుతున్నారంటే.. అతని ఆలోచనలు ఎలా ఉంటాయనేది బయటి ప్రపంచానికి అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: