బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఆమె తనకు కరోనా పాజిటివ్ అని వెల్లడించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రజలంతా  ఒక్కటవుతున్న విషయం తెలిసిందే.  ఈ సమయంలో  బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఆమెపై లక్నో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.  లక్నో ప్రభుత్వాసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. మార్చి 14న లక్నో ఎయిర్ పోర్టులో నిర్వహించిన కరోనా పరీక్షల్లో అత్యధిక స్థాయిలో వైరస్ ఉన్నట్టు గుర్తించారు.

 

ఇంటిలోనే నిర్బంధంలో ఉండాలని సూచించినా ఆమె పాటించకుండా పార్టీకి హాజరయ్యారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.  సింగర్ కనికా కపూర్‌ లండన్ నుండి తిరిగొచ్చిన తర్వాత కరోనా వ్యాది లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన డాక్టర్స్ ఆమెను నిర్భదంలో ఉండమని చెప్పారు.. అయినా కూడా ఆమె డాక్టర్స్ సలహాను పక్క చెవిన పెట్టి పలు పార్టీలకు హాజరైంది. అయితే ఆమె హాజరైన ఈ పార్టీలకు ప్రముఖ రాజకీయ నాయకులు, పలువురు సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు.

 

ఆ తర్వాత కనికా తనకు కరోనా సోకినట్లు ప్రకటించడంతో ఎవరైతే ఆమెతో పార్టీలకు హాజరయ్యారో వారంతా తీవ్ర ఆందోళనకు గురవ్వడంతో పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తనకు కరోనా సోకిందని కనిక సోషల్ మీడియాలో ప్రకటించడంతో, ఆ పార్టీకి హాజరైన వాళ్లందరూ హడలిపోతున్నారు.  ఇదిలా ఉంటే.. గాయని కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీలో తాను పాల్గొన్నానన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం  లేదని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే శనివారం స్పష్టం చేశారు. తాను పాల్గొన్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అవి తప్పుడు వార్తలని ఆయన ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: