దేశం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా పరిశ్రమ కు కరోనా వైరస్ దెబ్బ గట్టిగా తగిలింది అని చెప్పవచ్చు. దేశంలో అన్ని సినీ పరిశ్రమల్లో  కూడా దీని  ప్రభావంతో షూటింగ్ లను, సినిమా విడుదల ను దాదాపుగా ఆపేశారు. దీంతో ఇక ఇప్పుడు వాయిదా పడిన షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి అనేది స్పష్టత రావడం లేదు. ఇక ఇప్పుడు విడుదల వాయిదా పడిన సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా తెలియడం లేదు. 

 

తెలుగు తమిళం హిందీ భాషల్లో సినిమాలను ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు ఏ మాత్రం కనబడటం లేదు. ఇక సినిమా హాల్లో తెరిచే ప్రసక్తే లేదని ప్రభుత్వాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పుడు షూటింగ్ లను ఆపేశారు. అలాగే సినిమా హాల్ లను కూడా మూసివేశారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన షూట్ ఎప్పుడు చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ భాగం విదేశాల్లోనే షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 

 

అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరు కూడా విదేశాలకు వెళ్లి సినిమాలు షూట్ చేసే పరిస్థితి దాదాపు గా కనపడటం లేదని చెప్పాలి. స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ సినిమాలను వాయిదా వేశారు. అలాగే షాహిద్ కపూర్, రణవీర్ కపూర్, రణ్వీర్ సింగ్ సినిమా కూడా దాదాపుగా వాయిదా పడ్డాయి. సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిన సినిమాలు కూడా ఇప్పుడు వాయిదా పడటంతో నిర్మాతలు కూడా భారీగా నష్ట పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చాలా మంది స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: