చంద‌మామ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ మ‌ధ్య కాస్త అవ‌కాశాల ఊపు త‌గ్గిన ఈ భామ‌కి  రెమ్యునరేషన్ విషయంలోనూ చందమామ కిందకు దిగడానికి ఇష్టపడటం లేద‌ట‌. అయితే ఈమెను  హీరోయిన్‌గా కాజల్ గురించి ఆలోచించే దర్శక, నిర్మాతలూ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో కనిపించటం లేదు.


 
ఈ పరిస్థితుల్లో  సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించనున్న కొరియన్ మూవీ రీమేక్‌లో చందమామకు ఛాన్స్ కొట్టేసేలా ఉంద‌ని వినికిడి. ఒకప్పుడు కామెడీ హీరోగా చెలరేగిపోయిన నరేష్  ఆ తరువాత వరుస ఫ్లాపులతో పూర్తిగా డీలాపడ్డాడు. గతేడాది మహర్షిలో హీరో ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించి మెప్పించాడు.తనలోని ఎమోషనల్ పెర్ఫార్మర్‌ను చూపించిన నరేష్‌తో  సురేష్ బాబు ఓ కొరియన్ రీమేక్ ప్రాజెక్టు ప్లాన్ చేశారట.


 
‘డాన్సింగ్ క్వీన్’ రీమేక్ రైట్స్ సాధించిన సురేష్‌బాబు  నరేష్, కాజల్ జోడీగా ఆ ప్రాజెక్టును తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ పాత్ర కోసం కాజల్‌తో సంప్రదింపులు మొదలెట్టారన్న వార్త వినిపిస్తోంది. అయితే ప్ర‌స్తుతం కాజ‌ల్ ఫేడ్ అవుట్ భామ అనే చెప్పాలి. గ‌త కొంత కాలంగా తెలుగులో ఆమెకు స‌రైన అవ‌కాశాలు లేవు. అప్పుడ‌ప్పుడు ఏదో ఫొటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియాలో హంగామా చేయ‌డం త‌ప్పించి వేరే ఊపేమి క‌నిపించ‌డం లేద‌ట‌. ప్రస్తుతం కాజల్‌కు తెలుగులో సినిమాలే లేవు. కోలీవుడ్‌లో ఇండియన్ -2 వినా మరో కమిట్‌మెంట్ లేదు. సో, నరేష్‌తో జోడీకి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. పాత్ర కంటెంట్ నచ్చితే ఏ హీరోతోనైనా చేయడానికి ముందుకొస్తున్న కాజల్ -పారితోషికం విషయంలోనే కాంప్రమైజ్ అవుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు.


 
ప్రాజెక్టు బడ్జెట్ విషయంలో కాలిక్యులేటెడ్‌గా ఉండే సురేష్‌బాబు -రీమేక్‌పై భారీగా పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. చిన్న ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే  కాజల్ ఓకే చెప్తుందా? అన్నదే తేలాల్సిన విషయం. అయితే కాజల్ ఓకే చెప్పినట్టు కూడా తెలిసింది. ఇక సినిమావాళ్ళంటేనే అన్నీ పుకార్లు నిజ‌మేది..ఆబ‌ద్ధ‌మేది వన్న‌ది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: