క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ఏ రేంజ్‌లో విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్ర‌పంచంలోని అన్ని రాజ‌కీయాలు ప‌క్క‌కెళ్లిపోయాయి. అన్ని దేశాలు ప్ర‌జ‌ల్ని ఎలా కాపాడుకోవాలి అన్న‌ది ఒక్క‌టే ఆలోచ‌న‌గా పెట్టుకున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. మ‌రియు కొంద‌రు సెల్ఫ్ అరెస్ట్ చేసుకుంటున్నారు.

 

ఇదిలా ఉంటే.. జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సోలెస్‌’లో కథానాయికగా నటించిన ఉక్రెయిన్‌ మోడల్‌, నటి ఓల్గా కురిలెంకోకి కరోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గతవారంగా నేను అస్వస్థతకు గురయ్యాను. జ్వరం, తీవ్ర అలసటతో బాధపడుతూ ఉండటంతో ఆదివారం రోజున రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోన్నాను. ఆ తర్వాత పరీక్షల ఫలితాలను బట్టి పాజిటివ్ అని తేల్చారు అని ఆధివారం తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నా పరిస్థితి అంత అందోళనకరంగా లేదు. 

 

కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు ఇటీవ‌ల సందేశాన్ని పంపింది. అయితే ఇప్పుడు ఈమెకు నయం అయిపోయింది.  దానికి సంబంధించిన లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అభిమానులతో పంచుకుంది ఓల్గా. ఈ క్ర‌మంలోనే త‌న క‌రోనా పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని ఆమె వెల్ల‌డించింది. అలాగే తన అనుభవాన్ని చెప్తూ ఇంట్లో ఎవర్నీ మన దగ్గరకి రానీవ్వొద్దని చెబుతుంది. కరోనా సోకితే అది ఎవరికి సోకకుండా క్వారెంటైన్ చేసుకోవాలని చెబుతుంది ఈ బ్యూటి. 

 

మ‌రియు విటమిన్ బీ5, విటమిన్-ఈ, విటమిన్-సీ, జింక్ కరోనా నియంత్రణకు ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని చెప్పుకొచ్చిందీమె. అయితే ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని తెగ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆమె మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: