మానవ జీవితంలో శృంగారానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దంపతుల మధ్య శృంగార జీవితం అనేది ఎలాంటి అరమరికలు లేకుండా ఉండాలి... లేకుంటే దాంపత్య జీవితం అంతా సజావుగా సాగదు. ఒకరిపై మరొకరికి లేనిపోని అపోహలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం స‌క్సెస్ అవ్వ‌డానికి  చాలా కారణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మన పడక గదిలో ఉన్న రంగు సైతం శృంగారంపై ఆసక్తి లో కీలక పాత్ర పోషిస్తుందని శృంగార నిపుణులు చెబుతున్నారు. పడకగదిలో దంపతులు లోని శృంగార కోరికలు రగిలించడం లో మన ప్రవర్తన పై ప్రభావం చూపించడం లో రంగు కీలక పాత్ర పోషిస్తుంది అట.

 

చాలామంది ఎరుపు గులాబీ రంగు ప్రేమకు చిహ్నం.. అని వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అయితే వాటి కంటే నీలం రంగు ఎక్కువ ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది తాజా స‌ర్వే. ఈ సర్వేలో ఎక్కువ మంది నీలం రంగు ప్రశాంతమైనది అని చెప్పారట. నీలం రంగు గ‌దిలో ఉన్నవారు ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టు సర్వే స్పష్టం చేసింది. నీలం రంగు గ‌ది కలిగిన కుటుంబంలో ఉన్న దంపతులు సగటున వారానికి మూడు నుంచి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారట.

 

నీలం రంగు తర్వాత ఎక్కువగా ప్రభావం చూపింది ప‌సుపు రంగు. ప‌సుపు రంగు ఎక్కువగా ఆకలిని ప్రేరేపిస్తుంది అంటుంటారు. అలాగే పడక గదిలో సైతం ప‌సుపు రంగు ప్ర‌భావం మరింత అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి గ‌దుల్లో నివ‌సించే వారు స‌గ‌టున రోజుకు 7 గంట‌ల 40 నిమిషాల పాటు ప్ర‌శాంతంగా నిద్ర పోతున్నార‌ట‌. గ్రే లేదా సిల్వ‌ర్ రంగులో ఉన్న ప‌డ‌క‌గది వ‌ల్ల మూన్ లైట్ లాంటి లేదా ఓదార్పు వాతావ‌ర‌ణం క్రియేట్ అవుతుంద‌ట‌. అలాగే రాత్రి వేళ గ్రే లేదా సిల్వ‌ర్ రంగు ఉన్న ప‌డ‌క‌గ‌దిలో ప‌డుకుంటే వెన్నెల్లో ప‌డుకున్న వాతావ‌ర‌ణం క్రియేట్ అవుతుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: