యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ గ‌తేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు రెండు సినిమాలు డిజాస్ట‌ర్‌ అయ్యాయి. ఇక గత ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా వచ్చిన రూలర్ సినిమా సైతం డిజాస్టర్ అయ్యింది. మూడు వరుస ప్లాపులతో డీలా ప‌డ్డ బాలయ్య ఇప్పుడు తనకు కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రారంభమయింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.



ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ బాలయ్య డిఫరెంట్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. చిన్నపాటి జుట్టు, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో బోయ‌పాటి సినిమాలో బాల‌య్య లుక్ ఇదే నంటూ జోరుగా చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. అంజలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


ఈ సినిమాలో బాల‌య్య భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకున్నార‌ట‌. మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య అఘోరాగా న‌టిస్తున్నాడ‌ని అంటున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమా కూడా హ్యాట్రిక్ కొడుతుంద‌ని అంటున్నారు. మ‌రి బాల‌య్య - బోయాపాటి ఇద్ద‌రు ప్లాపుల్లో ఉన్నారు. వీరు ఈ సినిమాతో అయినా ఫామ్‌లోకి వ‌స్తారేమో ?  చూడాలి. ఇక ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న దానిపై పెద్ద క‌స‌ర‌త్తులే న‌డుస్తున్నాయ‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డిసినిమా నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: