బాలక్రిష్ణ అంటేనే ఒక రకమైన బిగ్ సౌండ్ వినిపిస్తుంది. ఆయన నందమూరి వంశాంకురం. ఆయన ఎన్టీయార్ ముద్దుల సినీ వారసుడు. బాలయ్య సైతం తండ్రి పేరుని ఇండస్ట్రీలో నిలబెడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు. టాప్ ఫోర్ సీనియర్లలో  ఒకరుగా ఉన్నారు. ఆయన సినీ కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి.

 

బాలయ్య దాదాపుగా అయిదు దశాబ్దాల సినీ కెరీర్ తో రికార్డు క్రియేట్ చేస్తున్నారు. ఆయన రికార్డు ఇప్పటి హీరోల్లో  ఎవరికీ సాధ్యం కాదు అన్నది విశేషం. ఇక బాలయ్య వయసు అరవై అయినా ఇరవై లాగానే అదే స్పీడ్, అదే జోష్ చూపించడం ఈనాటి జనరేషన్ కి ఒక స్పూర్తిగా చెప్పుకోవాలి. 

 

ఇక బాలయ్యకు ఈ మధ్య ఓ పెద్ద సమస్య వచ్చిపడింది. ఆయన సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. దానికి తోడు హీరోయిన్లు అసలు దొరకడంలేదు. దాంతో బాలయ్య రిపీటెడ్ గా చేసిన వారితోనే చేస్తూ వస్తున్నారు. దాంతో ఆయన మూవీస్ కి అనౌన్స్మెంట్ టైంలోనే ఎటువంటి పాజిటివ్  బజ్ లేకుండా పోతోంది. 

 

ఈ టైంలో ఆయన బోయపాటితో కలసి హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో తమన్నా, కాజల్, రకుల్, నయనతార సహా ఎన్నో పేర్లు అనుకున్నారు కానీ ఎవరూ ఎస్ చెప్పలేదు, దాంతో బాలయ్య సైతం విసిగిపోయారు. ఈ టైంలో ఆర్ ఎక్స్ 100 హాట్ భామ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పేరు ప్రస్తావనకు వచ్చిందంట.

 

ఆమె విషయంలో బోయపాటిని డీల్ చేయమనకుండా బాలయ్యే ఈసారి డైరెక్ట్ గా మాట్లాడారని టాక్. తన సినిమాలో చాన్స్ ఇస్తున్నానని, నటించాలని బాలయ్య ఫోన్ చేసి కోరడంతో పాయల్ నో అనలేకపోయిందట. అవును మరి సీనియర్ మోస్ట్ టాప్ స్టార్ బాలయ్యే ఫోన్ చేసి చాన్స్ ఇస్తే నో అనే సీన్ ఉంటుందా. మొత్తానికి బోయపాటి వల్ల కానిది బాలయ్య చేసి చూపించారు.  ఓ మంచి హాట్ బ్యూటీని తన పక్కన సెట్ చేసుకున్నారని అంటున్నారు.

 

 ఇది వర్కౌట్ అయింది కాబట్టి ఇకమీద నేరుగా బాలయ్యే తన హీరోయిన్లను ఫోన్లలోనే సెలెక్ట్ చేసేస్తారని అంటున్నారు. మొత్తానికి హీరోయిన్లు నో చెప్పకుండా బాలయ్య కొత్త  ట్రిక్ కనిపెట్టేశారు. మిగిలిన సీనియర్లు కూడా ఫాలో ఫాలో బాలయ్య అంటారేమో.
 

మరింత సమాచారం తెలుసుకోండి: