రికార్డులు అంటే ఎక్కడో హాలీవుడ్ వైపే చూస్తారంతా. కానీ బాలీవుడ్ కంటే కూడా ఎక్కువ రికార్డులు టాలీవుడ్ సంపాదించుకుంది. గిన్నీస్ రికార్డులకు ఎక్కిన ఘనత మన తెలుగు సినీ కళాకారులు అనేక సార్లు సొంతం చేసుకున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, మహిళా దర్శకురాలు విజయనిర్మల ప్రపంచ విజేతలుగా నిలిచారు. 

 

అలాగే గాయకుడు బాలు కూడా యాభై వేల వరకూ పాటలు పాడి గిన్నీస్ రికార్డులకు ఎక్కారు. అలాగే బ్రహ్మానందం  నటుడిగా వేయి చిత్రాలను దాటేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు దాదాపు తొంబై ఏళ్ళ వయసులో మళ్ళీ మెగా ఫోన్ పడుతున్నారు. అది గొప్ప సాహసమే అంటున్నారు.

 

సింగీతం అనగానే ఎన్నో సినిమాలు కళ్ళ ముందు కదులుతాయి. ఆయన ఈనాటి వాడా. ఏనాటి వాడో కదా. ఎపుడో మాయాబజార్ సినిమాకు నాటి మేటి డైరెక్టర్  కేవీ రెడ్డికి అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ తరువాత ఎన్నో సినిమాలు అద్భుతంగా స్రుష్టించారు. కమల్ హాసన్ తో విచిత్ర సోదరులు, పుష్ప‌క విమానం. బాలక్రిష్ణతో ఆదిత్య 369 మూవీస్ తీసి చిర కీర్తిని ఆర్జించారు.

 

బాలయ్య సింగీతం కాంబోలో ఆదిత్య 999 రావాల్సిఉంది. ఇవన్నీ ఇలా ఉంచితే సింగీతం ఇపుడు మెగా ఫోన్ ఈ వయసులో  పట్టి ఓ సీనియర్ గాయకుడి బయోగ్రఫీని తెరకెక్కిస్తారని అంటున్నారు. ఇక్కడ సింగీతం డైరెక్షన్ చేయదమే ఈ ఏజ్ లో గ్రేట్ అనాలి ఎందుకంటే ఇంత వయసు వచ్చేవరకూ బతికి ఉన్నవారు తక్కువ. 

 

ఒకవేళ బతికి ఉన్నా యాక్టివ్ గా ఉన్న వారు ఇంకా తక్కువ. కానీ మన సింగీతం మాత్రం 88 ఏళ్ళ వయసులోనూ ఎంతో చురుకుగా ఉంటారు. యంగ్ డైరెక్టర్లకు ఆయన ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఆయన చివరిగా  వెల్కం ఓబామా మూవీ తీశారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయన మూవీ తీయాలనుకోవడం పట్ల టాలీవుడ్ చాలా సంతోషంగా ఉంది. 

 

ఇక సినీ ప్రియులు, సింగీతం అభిమానులు కూడా ఆయన ప్రయత్నానికి జోహార్ అంటున్నారు. సింగీతం ఈ మూవీ తీస్తే కనుక ఆయన వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన వారు అవుతారు. మొత్తానికి మన తెలుగు దిగ్గజం సినీ కళామతల్లి పేరు నిలబెట్టేందుకు ఈ ఏజ్ లో ముందుకు రావడం గొప్ప విషయమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: