ప్ర‌పంచం మొత్తాన్ని క‌రోనా వైర‌స్ ఒక్క‌సారిగా అత‌లాకుత‌లం చేసేసింది. చిన్న‌లు పెద్ద‌లూ అంద‌రూ ఈ వైర‌స్‌కి ద‌ద్ద‌రిల్లిపోతున్నారు.  ఈ వైర‌స్‌ని ఎలా క‌ట్ట‌డి చేయాలో ఏమో కూడా వైధ్యుల‌కి అర్ధం కావ‌డం లేని ప‌రిస్థితి. దీంతో ప్ర‌భుత్వాలు సైతం దిగివ‌చ్చి మ‌రీ దీనికి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

 

క‌రోనా ర‌క్క‌సి ఎక్క‌డిక‌క్క‌డ జ‌నాల‌ను కాటేస్తోంది. ఏ క్ష‌ణం ఎవ‌రికి ఏం జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్థితి. ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతుందో తెలియ‌ని అయోమ‌యం. నివార‌ణను మించి మందు లేదు. సామాన్యుడి స్థాయి నుంచి కోటీశ్వ‌రుడి వ‌ర‌కు ఒక‌టే టెన్ష‌న్ క‌రోనా. ఏ ఒక్క‌రినీ విడిచి పెట్ట‌డం లేదు. దీంతో అంతా భ‌యంతో వ‌ణికిపోతున్నారు. సెల‌బ్రిటీలు క‌రోనా జాగ్ర‌త్త‌లు ఇలా తీసుకోండ‌ని అంద‌రికి వీడియోల రూపంలో సందేశాలిస్తున్నారు. ఈ ఆదివారం దేశ వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యించారు.

 

ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈ జ‌న‌తా క‌ర్ఫ్యూ ఉంటుంది. దీనికి అంతా మ‌ద‌త్తు ఇవ్వాల‌ని క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాల‌ని సెల‌బ్రిటీలు సైతం దీని పై ముమ్మ‌రంగా ప్ర‌చారం జ‌రుపుతున్నారు. ముక్త కంఠంతో జాగ్ర‌త్త‌లు చెపుతున్నారు. ప్ర‌ధాని మాట పాటిద్దాం, క‌రోనా విముక్త భార‌తాన్ని సాదిద్దాం అని ప‌వన్‌క‌ల్యాణ్ పిలుపునిచ్చారు.

 

హీరో మ‌హేష్ కూడా మ‌ద్దుతునిచ్చారు, మ‌న‌ల్ని ర‌క్షించ‌డానికి క‌రోనా పై ఫైట్ చేస్తున్న వారంద‌రికి సెల్యూట్ చేద్దాం. ప్ర‌ధాని చెప్పిన‌ట్టు మ‌న బాల్క‌నీలో నిల‌బ‌డి ద‌ద్ధ‌రిల్లిపోయేలా చ‌ప్ప‌ట్ల రీసౌండ్‌తో వారిని గౌర‌వించుకుందాం. అంద‌రూ సుర‌క్షితంగా ఆరోగ్యంగా వుండండి` అని మ‌హేష్ సోష‌ల్ మీడియా  ద్వారా సందేశాన్ని అందించారు. ఇక ఇదిలా ఉంటే దీన్ని చుల‌క‌న చేసి సోష‌ల్ మీడియాలో కొంత మంది కామెంట్లు పెడుతున్నారు.  అది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: