రాను రాను మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు అటు తమిళ చిత్ర పరిశ్రమలోను హీరోయిన్ కొరత బాగా వస్తుంది. అంటే హీరోయిన్స్ లేక కాదు. వాళ్ళు హీరోలకి సెట్ కాక. అంటే స్క్రీన్ మీద హీరో హీరోయిన్ గా కనిపిస్తున్న జంటలను చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇది మరీ తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలలో ఎక్కువగా ఉంది. బాలీవుడ్ లో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే అక్కడ సల్మాన్ సరసన కుర్ర భామలు నటించినా బాలీవుడ్ జనాలు చూస్తారు. అలాగే అక్షయ్ కుమార్ సరసన కియారా అద్వాని లాంటి హాట్ బ్యూటీ చేసిన అక్కడ వాళ్ళు ఆత్రంగా చూస్తారు. అదే మన దగ్గర మాత్రం సీనియర్ హీరో పక్కన కుర్ర భామ గనక నటిస్తే జనాలు తిట్టుకుంటారు.

 

అందుకే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత చాలా కనిపిస్తుంది. మన తెలుగులో ముఖ్యంగా చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకు ఈ సమస్య బాగా ఉంది. కుర్ర హీరోలకు సీనియర్ హీరోయిన్లు కూడా సూట్ అవుతున్నారు. కానీ సీనియర్ హీరోలకు కాజల్ అగర్వాల్, త్రిష, నయనతార, తమన్నా భాటియా లాంటి సీనియర్లు కూడా సెట్ అవక ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు.

 

తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ లాంటి సీనియర్ హీరోలకు ఇదే సమస్య. తమిళ్ సీనియర్ హీరో ఇళయ దళపతి విజయ్ కి టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి హీరోయిన్ల గురించి సమస్య లేదు. వాళ్ళకి నయనతార, త్రిష, కాజల్ దగ్గర్నుంచి నిన్న వచ్చిన కన్నడ బ్యూటి రష్మిక మందన వరకు చాలా మంది జంటగా సెట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో కూడా ఆయన సరసన కీర్తిసురేష్, అను ఇమ్మానుయేల్ లు సెట్ కాలేదన్న టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఇప్పుడు ఆచార్య సినిమాకి చిరంజీవి కి హీరోయిన్ సమస్యే ఎదురైందని టాక్. ఇలా సీనియర్ హీరోలకి తగిన జోడి కుదరకనే కొన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరించడం లేదు. దాంతో దారుణంగా ఫ్లాపవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: