సినిమా ఇండ‌స్ట్రీలో ఒక సినిమా అనుకున్నాక అది ప‌ట్టాలెక్కేదాకా డ‌వుటే. ఏదో ఒక రీజ‌న్‌తో స్టార్ట్ అవ్వ‌కుండా ఆగిపోయిన చిత్రాలు అనేక‌మున్నాయి. అలా మొద‌ట్లోనే ఆగిపోతే ప‌ర్వాలేదు కానీ షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోతే ఆ నిర్మాత‌కు ఎంతో లాస్ అవుతుంది. అంతేకాక ఆ హీరో డైరెక్ట‌ర్ల‌కి కూడా డ్యామేజ్ అవుతుంది. హీరోల పై ఆశ‌లు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరుత్సాహ‌ప‌డ‌తారు. అలా ఓపెనింగ్‌లు అయి షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయిన సినిమాలు, వాటి ఆశ‌క్తిక‌ర విష‌యాల గురించి తెలుసుకుందాం.

 

చిరంజీవి రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 1997లో ఓ చిత్రం మొద‌ల‌యింది. ఆ చిత్రానికి అశ్వినిద‌త్ ప్రొడ్యూస‌ర్ వినాల‌ని ఉంది అన్న టైటిల్‌ని కూడా ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటుల కూడా చిత్రీక‌రించారు. అయితే క‌థ విష‌యంలో చిరుకి, వ‌ర్మ‌కి చిన్న తేడా రావడంతో స్క్రిప్ట్‌లో క‌ల‌గ‌చేసుకుంటే సినిమానైనా వ‌దిలేసే వ‌ర్మ అన్న‌ట్లుగానే సినిమాని వ‌దిలేశారు. కానీ అప్ప‌ట్లో సంజ‌య్‌ద‌త్ సినిమా కోసం ఈ సినిమాని వ‌దిలేసినట్టు ప్ర‌చారం చేశారు. త‌ర్వాత ఈ సినిమా కోసం చేసిన పాట‌లు చూడాల‌ని ఉంది సినిమాలో ఉప‌యోగించారు. అబూబ్ బాగ్‌దాద్ గ‌జ‌దొంగ ఈ చిత్రం మొత్తం ఐదు భాష‌ల్లో అనుకుని ఇంగ్లీష్‌తో స‌హా తీయాల‌నుకున్నారు. చిరంజీవి హీరోగా హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. బ‌డ్జెట్ కార‌ణాల వ‌ల్ల ఈచిత్రం ఆగిపోయింది. ఆ త‌ర్వాత చిరంజీవి సింగీతం శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో భూలోక‌వీరుడు చిత్రం కొంత షూటింగ్ జ‌రుపుకున్నాక అవుట్‌పుట్ స‌రిగా రావ‌డం లేద‌నే కార‌ణంతో ఈ సినిమా నుండి చిరంజీవి త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత చిరంజీవి శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న వ‌జ్రాల కోట అనే చిత్రం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. కొన్ని సీన్లు చిత్రీక‌రించాక మ‌ధ్య‌లో లోపాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింది.

 

ఇక బాల‌కృష్ణ న‌ర్త‌న‌శాల భారీగా మొద‌లై ద్రౌప‌దిగా న‌టించాల్సిన సౌంద‌ర్య మ‌ర‌ణించ‌డంతో ఈ చిత్రం ఆగిపోయింది. ఇక బాల‌య్య హీరోగా కోడిరామ‌కృష్ణ‌ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ భూప‌తి  అనే చిత్రం అనే జాన‌ప‌ద చిత్రం దాదాపు 75 ప‌ర్సెంట్ చిత్రం షూటింగ్ జ‌రుపుకున్నాక బాల‌కృష్ణ‌కు, కోడిరామ‌కృష్ణ‌కు జ‌రిగిన చిన్న గొడ‌వ వ‌ల్ల అంత‌టితో ఆ చిత్రం ఆగిపోయింది. వేరే డైరెక్ట‌ర్‌తో తీద్దాం అనుకున్నా అదీ కుద‌ర‌లేదు. బిగోపాల్  ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర హ‌ర‌మ‌హ‌దేవ అనే చిత్రం మ‌ధ్య‌లోనే షెడ్యూల్ జ‌రుపుకుని ఆగిపోయింది. బాల‌య్య హీరోగా స‌ముద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. బాల‌కృష్ణ మిలిట‌రీ మ్యాన్‌గా న‌టించాల్సిన ఈ చిత్రం ఓపెనింగ్ సీన్‌తోనే ఆగిపోయింది. 

 

వెంక‌టేష్ హీరోగా బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బావ‌మ‌రిది అనే చిత్రం మొద‌లైంది. సోభ‌న్ బాబు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లో న‌టించాలి అయితే ఆయ‌న కొంత వ‌ర‌కు న‌టించాక త‌న పాత్ర న‌చ్చ‌క డ్రాప్ అయ్యాడు అంటారు. అంత‌టితో ఈ సినిమా అక్క‌డితో ఆగిపోయింది. త‌ర్వాత ఈ చిత్రం సుమ‌న్‌తో తీశారు అన్నారు. వెంక‌టేష్ హీరోగా పెద్ద వంశీ ద‌ర్శ‌క‌త్వంలో గాలిపురం రైల్వేస్టేష‌న్ అనే చిత్రం మొద‌ల‌యింది. నాలుగు రోజుల పాటు షూటింగ్ జ‌రుపుకున్నీ చిత్రం కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఇక రీసెంట్‌గా మారుతితో రాధా అనే చిత్రం ఒప్పుకుని క‌థ న‌చ్చ‌క మ‌ళ్లీ ప‌క్క‌న ప‌డేశారు. వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి అనే సినిమా షూటింగ్ జ‌రుపుకుని ఇద్ద‌రికి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ రావ‌డంతో ఈ సినిమా ఆగిపోయింది. 

 

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంతో ఇష్టంగా త‌నే డైరెక్ట‌ర్‌గా స్టార్ట్ చేసిన చిత్రం స‌త్యాగ్ర‌హి స్టిల్స్‌, పోస్ట‌ర్స్ కూడా రిలీజ్ చేసిన ఈచిత్రంలో ఒక మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా షూట్ చేశారు. కాని ఎందుక‌నో ప‌వ‌న్ ఈ సినిమాని అర్ధాంత‌రంగా ప‌క్క‌న పెట్టేశారు. ఇక చెప్పాల‌ని ఉంది చిత్రాన్ని ముందు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అమీషాప‌టేల్‌తో తీశారు. షూటింగ్ కూడా దాదాపు పూర్త‌యింది. అయితే ఈ సినిమా మ‌ల‌యాళ సినిమాకు రీమేక్ అవ్వ‌డం వ‌ల్ల ఆ రైట్స్ విష‌యంలో గొడ‌వ రావ‌డం రామోజీరావ్ చ‌క్రం తిప్ప‌డం వ‌ల్ల ఈ సినిమా రైట్స్ రామోజిరావ్ చేతిలోకి వెళ్ళిపోయాయి. దాంతో పవ‌న్ డ్రాప్ అయి ఖుషి సినిమా చేసుకోవ‌డంతో చెప్పాల‌ని ఉంది చిత్రం పెండింగ్‌లో ప‌డిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: