క్రిష్ అంటే ఏ హీరోయిన్ అయినా తన ఖాతాలో చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన హిట్ పడుతుందని ఫిక్సైపోతారు. అంతేకాదు...ఆయన ఇచ్చే ఇమేజ్ తో స్టార్ హీరోయిన్ అవుతామనుకుంటారు కూడా చాలామంది. ఇక ఇండస్ట్రీలో గాని హీరోలలో గాని క్రిష్ అంటే అందరికి ఎంతో నమ్మకం అభిమానం. ఆయన మొదటి సినిమా గమ్యం దగ్గర్నుంచి గౌతమీ పుత్ర శాతకర్ణి వరకు ఒక్కో సినిమా ఒక్కో మైల్ స్టోన్ లా రూపొందించాడు. ఈ సినిమాలు క్రిష్ కి డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చింది. ఇక క్రిష్ తెరకెక్కించిన కంచె ఒక అద్భుతమైన సక్సస్ ని అందుకున్న సంగతి తెలిసిందే.

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి మంచి వసూళ్ళు దక్కాయి. అంతేకాదు ఈ సినిమా వరుణ్ తేజ్ సినిమా కెరీర్ లో టాప్ టెన్ లిస్ట్ లో ఉండే సినిమాగా క్రిష్ తెరకెక్కించడం గొప్ప విషయం. ఈ సినిమాతో క్రిష్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యూటి ప్రగ్యా జైస్వాల్. ఈ అమ్మడు కంచె తర్వాత టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. కాని ఎందుకనో కంచె తర్వాత మళ్ళీ హిట్ అన్నది అమ్మడి ఖాతాలో చేరలేదు. 

 

క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ప్రగ్యా జైస్వాల్ ఫేట్ ని మార్చలేకపోయారు. ప్రగ్యా జైస్వాల్ ని పిచ్చ హాట్ గా చూపించినప్పటికి సినిమా ఫ్లాపవడంతో ప్రగ్యా జైస్వాల్ ఏవరికీ ఆనలేదు. ఆ తర్వాత మంచు విష్ణు తో నటించిన ఆచారి అమెరికా యాత్ర కూడా ప్రగ్యా జైస్వాల్ కి ఏమాత్రం కలిసి రాలేదు. అయితే ప్రగ్యా జైస్వాల్ కి ముందు నుంచి తనని ఇండస్ట్రీకి తీసుకు వచ్చిన క్రిష్ మీదే ఆశలన్ని పెట్టుకుంది. ఆయనే మళ్ళీ తనకి ఒక హిట్ ఇస్తాడని భావించింది. కాని క్రిష్ ప్రగ్యా జైస్వాల్ మర్చిపోయారా లేక వదిలేశారా అన్నది అర్థం కావడం లేదు. ఏదేమైనా ఇలా వచ్చి అలా ఫేడవుట్ అయిన హీరోయిన్స్ లిస్ట్ లో ప్రగ్యా జైస్వాల్ కూడా చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: