ఎవరైనా ఒక రంగం లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతు ఇక లైఫ్ కి ఢోకా లేదనుకున్నప్పుడు సేఫ్ సైడ్ గా మరో బిజినెస్ కి ప్లాన్స్ చేసుకుంటారు. అంతేకాదు వ్యాపార రంగంలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదగడానికి చాలా శ్రమిస్తుంటారు. ఇది బిజినెస్ స్ట్రాటజీ అనే కంటే ముందు జాగ్రత్త చర్య అనడన్ కరెక్ట్. ఎందుకంటే జీవితాంతం ఎవరూ ఒకే రంగంలో సక్సస్ ఫుల్ గా కొనసాగలేరు. అది అందరికీ తెలిసిందే. అందుకే మన సెలబ్రిటీస్ చాలా మంది వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా రక రకాల వ్యాపారాలను మొదలు పెడుతుంటారు.

 

ఇప్పుడు అదే విధంగా టాలీవుడ్ లో అల్లు అర్జున్ కూడా బిజినెస్ లోకి ఎంటరయ్యాడట. ఇప్పటికే కొన్ని వ్యాపారాల్లో ఇన్వెస్టుమెంట్లు చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కార్లను లీజ్ కి ఇచ్చే ఒక ఆటో మొబైల్ కంపెనీలో 8 కోట్లు పెట్టి 7 శాతం వాటాను రీసెంట్ గా కోలుగోలు చేసాడని చెప్పుకుంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు సెలెబ్రెటీల పెళ్లిళ్లకు శుభకార్యాలకు బ్రాండెడ్ కార్లను లీజుకు ఇస్తూ ఉంటారట. ఈ వ్యాపారంలో బన్నీతో పాటు తెలంగాణాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడు భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. 

 

మొత్తానికి మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొత్త గా పలు వ్యాపార మార్గాలను వెతుక్కుంటు బాగా సంపాదించాలనే ప్లాన్స్ వేసుకొని సక్సస్ కూడా అవుతున్నారు. ఇక ఎప్పటి నుంచో అక్కినేని నాగార్జున హీరోగా బిజీగా ఉన్నప్పుడే వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సక్సస్ అయ్యారు. ఆ తర్వాత కొంతమంది నాగార్జున ఇన్స్పిరేషన్ గా తీసుకొని వ్యాపార రంగంలోకి దిగారు. అయితే వాళ్లలో కొందరు సక్సెస్ అయ్యారు. కాని కొందరు మాత్రం చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అదే దారిలో వెళ్తున్న బన్నీ వ్యాపారంలో సక్సెస్ అవుతాడా లేదా చూడాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ.ఎం.బి సినిమాస్ అంటూ థియోటర్స్ బిజినెస్ లోకి వచ్చి సక్సస్ అయిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: