తమిళ సినిమా రంగంలో విజయ్ ఫామ్ మంచి ఫార్మ్ మీద ఉంది. గత రెండు సంవత్సరాల నుండి విజయ్ నటించిన ప్రతి సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏదో ఒక రికార్డు సృష్టిస్తోంది. మినిమమ్ గ్యారంటీ గా 100 కోట్ల మార్క్ ఈజీగా కలెక్షన్లు రాబడుతోంది. సినిమా హిట్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అన్న దానితో పని లేకుండా విజయ్ క్రేజ్ ఉన్న కొద్ది పెరుగుతూ భారీగా వసూళ్లు చేస్తున్న సినిమాలు రాబోతున్నాయి. విజయ్ గత సినిమా బిగిల్‌ ఏ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది అన్న దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మరియు మలయాళంలో ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఫామ్ కొనసాగించాలి అనే విధంగా విజయ్ గత కొన్నాళ్ల నుండి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కనీసం సంవత్సరం లో అవలీలగా రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుని సినిమాలు చేస్తూ కెరియర్ సాగిస్తున్నాడు.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వైపు మాస్టర్‌ చేస్తూనే మరో వైపు తదుపరి చిత్రంకు సంబంధించిన చర్చలు జరుపుతున్నాడు. అయితే విజయ్ పెద్ద రిస్క్ చేస్తున్నాడు అని, ఫ్లాప్ డైరెక్టర్ తో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే నిన్న మొన్నటి వరకు విజయ్‌ తదుపరి చిత్రం సుధ కొంగర దర్శకత్వంలో ఉంటుందని అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్‌ తదుపరి చిత్రం మురుగదాస్‌ దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది.

 

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తుపాకి, కత్తి, సర్కార్‌ చిత్రాలు వచ్చాయి. ఆ మూడు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి. అయినా గాని ప్రస్తుతం మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలు తమిళ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న నేపథ్యంలో మురగదాస్ ఫార్మ్ కోల్పోయాడు, అతనితో ఈ టైంలో విజయ్ సినిమా చేయడం చాలా డేంజర్ అని రాంగ్ డెసిషన్ అని, తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: