ఒకపక్క వయసు మీద పడిపోయింది, మరోపక్క రాజకీయాలు, ఇటువంటి టైములో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్. చాలా వరకు వయసు పెరిగే కొద్దీ సినిమాలు తగ్గించుకుంటారు హీరోలు. కానీ రజనీకాంత్ దానికి భిన్నంగా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే విధంగా సినిమాలు ఒప్పుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు. ఇదే టైం లో మరోపక్క రాజకీయ పనులు కూడా తనదైన శైలిలో చక్క చక్క రెడీ అయ్యేటట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి టైం లో 'దర్బార్' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రజినీకాంత్ ఆశించిన స్థాయిలో అభిమానులను అలరించ లేకపోయారు.

 

భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధర్భర్' సినిమా బోల్తా పడింది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండాగానే తన తదుపరి సినిమా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉండగా సంగతి వీరాభిమాని అయిన లారెన్స్ కి అవకాశం ఇవ్వడానికి రజినీకాంత్ రెడీ అయినట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

నటుడు డాన్సర్ మరియు డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఎప్పటినుండో రజినీకాంత్ కి వీరాభిమాని. ఆయనతో సినిమా చేయాలని చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాడు. అయితే తన అభిమాని కోరిక తీర్చడానికి రజనీకాంత్ రెడీ అయినట్లు సమాచారం. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో రాగానే రజనీకాంత్ తన మార్కెట్ నాశనం చేసుకునే నిర్ణయం తీసుకున్నాడని...రాఘవ లారెన్స్ తో సినిమా అంటే రజినీకాంత్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లే అని కామెంట్ చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: