ఇప్పటి వరకు విదేశాల నుండి భాగ్యనగరం వస్తున్న వారి వలన మాత్రమే కరోనా భయం మనలను వెంటాడుతోంది అన్న నమ్మకంలో భాగ్యనగర వాసులు ఉన్నారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కుకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్న ఒక మహిళకు కరోనా వ్యాధి సోకింది అని వార్తలు రావడంతో భాగ్యనగరం ఒక్కసారి ఉలిక్కి పడింది.


దీనితో ఎలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ప్రధాన మంత్రి మోడీ పిలుపు ఇచ్చిన జనతా కర్ఫ్యూను నేడు 24 గంటల జనతా కర్ఫ్యూ మార్పులు చేసి కరోనా పై తెలంగాణ ప్రభుత్వం యుద్దాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఈ విషయాలను పట్టించుకోకుండా పవన్ కొద్ది రోజుల క్రితం తన జనసేన పార్టీని జనంలోకి తీసుకు వెళ్ళడానికి ప్రారంభించిన ‘మన నది మన నుడి’ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పాటను విడుదల చేస్తే ఆ పాటను ఈ కరోనా ఎఫెక్ట్ తో పవన్ అభిమానులు కూడ పట్టించుకాకపోవడం చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.   


నది ప్రాశస్యాన్ని నుడి ప్రాముఖ్యతను వివరిస్తూ రామ్ జోగయ్య శాస్త్రి రాసిన పాటకు థమన్ స్వరాలు సమకూర్చాడు. ఈ పాటను జనసేన యూ ట్యూబ్ చానెల్ లో ఈ గీతాన్ని అప్ లోడ్ చేసారు. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా పవన్ కు విపరీతంగా అభిమానులు ఉన్నప్పటికీ ఈ పాట యూట్యూబ్ లో లోడ్ చేసి ఒకరోజు పూర్తి అవుతున్నా ఈ పాటకు ఇప్పటికీ కొన్నివేల సంఖ్యలోనే హిట్స్ రావడంతో కరోనా భయాలతో ఉన్న పవన్ అభిమానులు పవన్ పాటలను కూడ అంతగా పట్టించుకోవడం లేదా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 


అయితే ఆమధ్య పవన్ ‘వకీల్ సాబ్’ కు సంబంధించి ‘మగువా మగువా’ పాట రిలీజ్ అయిన కొద్ది గంటలకే లక్షల సంఖ్యలో హిట్స్ వచ్చాయి. దీనితో పవన్ అభిమానులు కూడ పవన్ ను పూర్తిగా సినిమా స్టార్ గానే గుర్తిస్తున్నారు తప్ప ‘జనసేన’ ప్రచారాన్ని పట్టించుకోవడం లేదా కరోనా భయాలతో పవన్ అభిమానులు కూడ పవన్ విషయాలు పూర్తిగా మరిచిపోతున్నారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనినిబట్టి చూస్తుమేట్ ప్రస్తుతం ఒక్క కరోనా వార్తలు తప్ప మరే వార్తలు పట్టించుకునే స్థితిలో లేరు అని అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: