వంటలక్క.. ఈ పేరు మనం ఒక సంవత్సరం ముందు అసలు విని ఉండం. కానీ ఇప్పుడు.. ఆమె మన ఇంట్లో ఒక కుటుంబసభ్యురాలు అని అనడంలో ఏలాంటి సందేహము లేదు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగా ఉంటుంది ఆ సీరియల్. వంటలక్క అంటే కార్తీకదీపం. ఈ సీరియల్ లో ఎన్ని ట్విస్టులు.. ఎన్ని అనుమానాలు.. ఎన్ని కోపాలు ఉంటాయి. 

 

పాపం.. వంటలక్క సీరియల్ లో ఏడిస్తే.. ఆ సీరియల్ చూసే వారి కళ్ళలో నీళ్లు వస్తాయ్. అంత ఎమోషన్స్ ను తెచ్చి పెడుతుంది ఆ సీరియల్. ఇంకా ఆ సీరియల్ డాక్టర్ బాబు అబ్బో.. సౌర్య.. హిమ. సౌందర్య.. ఈ సీరియల్ ముఖ్యపాత్రలు. ఈ సీరియల్ ను పిల్లలు కూడా చూస్తారు. పెద్దలు కూడా చూస్తారు. 

 

అందుకే ఈ సీరియల్ బుల్లితెర స్టార్ సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ స్థాయిలో నెంబర్ 1 రేటింగ్ తో ఈ సీరియల్ కోట్లమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సీరియల్ ఇప్పటికే 761 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. అలాంటి ఈ సీరియల్ కు నిన్న బ్రేక్ పడింది... మీకు ఆశ్చర్యం వేసిన ఇది అక్షరాలా నిజం. 

 

కరోనా దెబ్బకు వంటలక్కే కాదు అన్ని సీరియల్స్ బంద్ అయ్యాయి అంటే నమ్మండి.. కరోనా వైరస్ కారణంగా సీరియల్ షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో సోమవారం నుండి శనివారం వరుకు రావాల్సిన సీరియల్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు వెలిగే కార్తీక దీపం నిన్న వెలగలేదు.. దీంతో అభిమానులు అంత ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

 

కార్తీక దీపామె కాదు.. అన్ని సీరియల్స్ ఆగిపోయాయి.. ఇంతింత గృహలక్ష్మి, గోరింటాకు, సిరిసిరి మువ్వలు, వదినమ్మ.. ఒకటి ఏంటి అన్ని సీరియల్స్ ఆగిపోయాయి. ఆ టైంలో బాహుబలి సినిమా వచ్చింది. ఒక్క స్టార్ మా నే కాదు.. జెమినీ టీవీ కూడా సీరియల్ ను ఆపేసింది.. అయితే జీ తెలుగు, ఈ టీవీ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా సీరియల్స్ ను తేలి క్యాస్ట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: