అంతకుముందు రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్, ఇమేజ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే సరికి వచ్చింది. పూరి జగన్నాథ్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా హీరోయిన్స్ ను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే నిధి అగర్వాల్ ను ఇస్మార్ట్ శంకర్ లో ఫుల్లుగా వాడేశాడు. ఆ సినిమాతో అమ్మడు సూపర్ పాపులర్ అయ్యింది. హిట్టు దక్కడంతో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ కాంబో సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ పట్టేసింది అంటున్నారు. 

 

తెలుగుతో పాటుగా తమిళంలో కూడా క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటున్న నిధి అగర్వాల్ కు ఒక ప్రముఖ నిర్మాత తన సినిమాలో ఐటం సాంగ్ కోసం సంప్రదించాడట. ఈమధ్య హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్స్ చేస్తున్నారు. కాజల్, తమన్నా, శృతి హాసన్ లాంటి హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ లో నర్తించారు. ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ నిధి అగర్వాల్ కు వచ్చింది. అయితే తానూ స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ కానీ అందుకు 60 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుంది నిధి అగర్వాల్. 

 

ప్రస్తుతం నిధి ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కు అటు ఇటుగా ఐటం సాంగ్ చేసినా సరే అంత ఇవ్వాల్సిందే అన్నట్టుగా డిమాండ్ చేస్తుంది. అయితే 60 లక్షలు ఇచ్చిన ఆ సాంగ్ కు కావాల్సినంత క్రేజ్ తెచ్చే టాలెంట్ నిధికి ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇంతకీ నిధి అగర్వాల్ చేసే ఐటం సాంగ్ ఏ సినిమాలో.. అమ్మడు ఆడిపాడేది ఏ స్టార్ తో అన్నది ఇంకా తెలియలేదు. త్వరలోనే ఆ డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక పక్క హీరోయిన్ గానే కాదు ఇలా స్పెషల్ సాంగ్స్ కు సైన్ చేస్తూ నిధి బాగానే సంపాదిస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: