అల్లు అర్జున్ నిరంతరం సోషల్ మీడియాలో సందడి చేస్తూ తన ఇమేజ్ ని కాపాడుకోవడంలో దిట్ట. ‘నాపేరు సూర్య’ మూవీ ఫెయిల్యూర్ తరువాత సుమారు సంవత్సరానికి పైగా బన్నీ సినిమాలు రాకపోయినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవడానికి గల కారణం బన్నీకి సోషల్ మీడియా పై ఉన్న పట్టు. 

 

తరుచు తన పిల్లలకు సంబంధించి అదేవిధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను తన అభిమానులకు షేర్ చేస్తూ బన్నీ నిరంతరం మీడియాలో హాట్ టాపిక్ గా కొనసాగే విధంగా చాల తెలివిగా అతడి వ్యూహాలు ఉంటాయి. ప్రస్తుతం కరోనా దెబ్బతో ఎవరికి వారు స్వీయ గృహ నిర్భధం విధించుకుని పూర్తిగా తమ ఇళ్లలోనే ఉంటూ తమ కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతున్నారు.

 

ఇప్పుడు బన్నీ కూడ అదేవిధంగా తన ఇంటిలో కాలంగడుపుతున్నాడు. అయితే ఈసారి ఈ క్రేజీ హీరో తన పిల్లలకు సంబంధించిన ఫోటోను కాకుండా తన నాన్నమ్మను వీల్ చైర్ లో కూర్చోపెట్టుకుని తన ఇంటిలోని లాన్ లో తిప్పుతున్న ఫోటోను షేర్ చేసాడు. 

 

అల్లు అర్జున్ కు తన చిన్నప్పటి నుండి తన నానమ్మ అంటే చాల ఇష్టం. అయితే షూటింగ్ లు హడావిడి వల్ల ఎప్పుడు తాను హీరో అయ్యాక తన నానమ్మతో సరిగ్గా సమయం గడపలేక పోయాను అన్న ఫీలింగ్ బన్నీకి ఉంది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు నిలిచిపోవడంతో ఒకవైపు సుకుమార్ సూచనతో తన లుక్ ను మార్చుకుంటూ మధ్యలో ఇలా తన నానమ్మతో ఆనందంగా గడుపుతూ ఆమెకు ముద్దు పెడుతున్న ఫోటోను బన్నీ తన అభిమానులకు షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో అల్లు అర్జున్ అభిమానుల మధ్య వైరల్ గా మారి బన్నీ పై ప్రశంసలు వస్తుంటే బన్నీ వ్యతిరేకులు మాత్రం కరోనా వల్ల వచ్చిన క్వారంటైన్ టైమ్ ను కూడ చాల తెలివిగా తన ఇమేజ్ పెంపుదలకు వాడుకుంటున్న ‘దేశముదురు’ బన్నీ అంటూ జోక్ చేస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: