టెలివిజన్ మీద అత్యంత పాపులారిటీ సాధించిన ప్రోగ్రామ్ గా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తుంది. తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్ స్టార్ట్ కానుంది. మూడు సీజన్లకి ముగ్గురు హోస్ట్ లు మారిన ఈ షోకి నాలుగవ సీజన్లో ఎవరు హోస్ట్ గా చేస్తారనే చర్చ మొదలైంది. హోస్ట్ గా మహేష్ బాబు పేరు వినిపించినప్పటికీ అధికారికంగా ఇంకా డిసైడ్ కాలేదు.

 

 

అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ గా ఉంచాలని భావిస్తున్నారు. ఈ విషయమై బిగ్ బాస్ టీం క్లారిటీ గా ఉంది. కానీ నాగార్జున నుండి ఈ విషయమై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. హోస్ట్ గా నాగార్జున చాల ఈజ్ గా చేయడమే కాకుండా వివాదాలేవీ రాకుండా చూసుకున్నాడని, అలాగే ఒక సీనియర్ నటుడు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడంటే కంటెస్టెంట్లలో ఒకరకమైన భయం లాంటిది ఉంటుందన్న భావంతో నాగర్జునకి ఈ ఆఫర్ ఇచ్చారు.

 


కానీ నాగార్జున ఈ ఆఫర్ పై ఆలోచించడం సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే కొందరు విశ్లేషకులు నాగార్జున బిగ్ బాస్ చేస్తే అతనికే మంచిది అని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సినిమాలు చాలా తగ్గించాడు. ఏడాదికో సినిమా చేస్తున్నా కూడా ఒక్కోసారి హిట్ కొట్టలేకపోతున్నాడు. ఇలాంటి టైంలో టెలివిజన్ మీద కనిపించడం ఆవశ్యకం. జనాలకి కనిపిస్తూ ఉంటే నాగార్జున సినిమాలకి కూడా గిరాకీ పెరుగుతుంది.

 


అలా కాదని ఎప్పుడో ఓసారి సినిమా ద్వారా కనబడదాం అనుకుంటే సీనియర్ హీరో అయిన నాగార్జునకి చిక్కులు తప్పవని అంటున్నారు. మరి ఈ రకంగానైనా ఆలోచింది నాగార్జున నాలుగవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: