మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస వైఫల్యాలతో అవస్థలు పడుతున్నాడు. తెలుగు సినిమాల్లో ట్రెండ్ మారిన తర్వాత తన సినిమాల్లో ఆ మార్పును తీసుకువద్దామని భావించకపోవడం వల్లనే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటున్నారు. కానీ రవితేజ తన ట్రెండ్ మార్చుకుని తీసిన చిత్రాలు ఎంత ఘోరంగా పరాజయం సాధించాయో తెలిసిందే. అందుకే రవితేజ తనకు నప్పిన, తనను చూడాలనుకుంటున్న మాస్ సినిమాల్తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

 


ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్సె వచ్చింది. టీజర్ వచ్చినప్పటి నుండి ఈ సినిమ తమిళ చిత్రం నుండి రీమేక్ చేస్తున్నారనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయమై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

క్రాక్ తర్వాత రవితేజ రాక్షసుడు సినిమ ద్వారా యావరేజ్ హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడట. ఆ చిత్రం తర్వాత హలో గురూ ప్రేమ కోసమే సినిమాతో హిట్ సాధించిన త్రినాథరావు నక్కినతో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ రెండు చిత్రాలకి రవితేజ భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నాడట. డిస్కోరాజా తర్వాత రవితేజ మార్కెట్ చాలా దెబ్బతింది.

 


ఇలాంటి టైంలో అంత మొత్తంలో ఇచ్చుకోలేమని చెబుతున్నా కూడా వినిపించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. పారితోషికానికే పది కోట్లు ఇస్తే సినిమా నిర్మాణానికి ఖర్చు పెరుగుతున్నందున అంత మొత్తంలో రవితేజ మీద ఇన్వెస్ట్ చేసేందుకు భయపడుతున్నారట. ఇదిలా ఉంటే రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటా తీసుకునేందుకు రెడీ గా ఉన్నాడట. దీంతో నిర్మాతలు వాటా ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: