బాలీవుడ్‌ లో గాయని కనికా కపూర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన కనికా తరువాత పలు ప్రైవేట్ పార్టీల్లో పాల్టొనటం తరువాత ఆమె కరోనా పాజిటివ్‌గా తేలటంతో ఒక్క సారిగా దేశం ఉలిక్కి పడింది. కనికా పాల్గొన్న పార్టీల్లో పలువరు ప్రజా ప్రతినిథులు కూడా పాల్గొనటం, తరువాత వారు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు కనికా తీరుపై మండిపడుతున్నారు.

 

అయితే అందరూ కనికాను విమర్శిస్తుంటే బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మాత్రం భిన్నంగా స్పందించింది. అందుకూ కనికాపై నిప్పులు చెరుగుతుంటే సోనమ్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచింది. దీంతో సోనమ్‌పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కనికాకు మద్దతు పలకటంపై సోనమ్‌ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. తన సోషల్ మీడియా పేజ్‌ లో `కనికా కపూర్‌ మార్చి 9న ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ రోజు దేశంలో సెల్ఫ్‌ ఐసోలేటింగ్ అనేది లేదు, అందురూ ఆనందంగా హోలీ ఆడుకుంటున్నారు` అంటూ ట్వీట్ చేసింది.

 

దీంతో నెటిజెన్లకు చిర్రెత్తుకొచ్చింది. కపూర్ అన్న తోక ఉన్నందుకే ఆమెకు మద్దతు ఇస్తున్నావా అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కనికా కపూర్‌ కు ఆరోగ్యం బాగు పడిన తరువాత ఆమెను కనీసం ఆరు నెలల పాటు జైల్లో పెట్టాలి అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజెన్ బాలీవుడ్ కపూర్ లకు ఏం అయ్యింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మరికొందరు ఈ ఏడాది ప్రజలు హోలీ ఆడలేదు. తెలుసుకొని మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: