కరోనా భూతం తన ప్రతాపం చూపిస్తూండడంతో ప్రజలంతా భయం గుప్పిట్లో ఉండిపోతున్నారు. రోజు రోజుకూ కరోనా బాధితులు, మృతులు పెరుగుతండడం కలవరపెడుతోంది. ఈ ఎఫెక్ట్ ప్రజలందరిపై ఎలా పడిందో తెలుగు సినిమా పరిశ్రమపై కూడా అలానే ప్రభావం చూపిస్తోంది. సినిమాల విడుదల వాయిదా, షూటింగులు నిలిపివేయడం, కార్మికులకు ఆదాయం లేకపోవడం, ధియేటర్లు రన్ కాకపోవడం.. ఇలా కోట్లలో ఇండస్ట్రీకి నష్టం వస్తోంది. ప్రస్తుత కరోనా దెబ్బకి ఇకపై సినిమా వాళ్లకు ఖర్చు ఆదా అవుతుందేమో..!

 

 

ఓ దశాబ్దం క్రితం నుంచీ తెలుగు సినిమాల్లో కథానుసారం విదేశాల్లోనే షూటింగులు జరిపారు. ఇప్పటికీ అదే జరుగుతోంది. కేవలం పాటల కోసమే విదేశాలకు వెళ్లేవారు. మన దేశంలో కూడా ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నా ఎవరూ అటువైపు వెళ్లిన దాఖలాలు లేవు. ఏవో కొన్ని చిన్న సినిమాలు ఖర్చు తగ్గించుకోవడానికి మినహా అందరూ విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్లినవారే. ప్రస్తుతం కరోనా భూతం ఎప్పుడు కంట్రోల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కంట్రోల్ అయిందని తెలిసినా ఇప్పట్లో యూరప్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాలకు షూటింగ్స్ కి వెళ్తారా.. అంటే ప్రశ్నార్ధకమే. యూరోప్ ఖండంలో ఎన్నో అందమైన దేశాలు.. ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.

 

 

ఇటలీ, ఫ్రాన్స్, లండన్, స్విట్జర్లాండ్, జర్మనీతో పాటు వెనీస్ లాంటి నగరాల్లో ఎన్నో సినిమాల షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు అక్కడ దాదాపు మరణమృదంగం తాండవిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వచ్చినా సినీ రంగం ఇప్పట్లో ఆయా దేశాలు, ప్రదేశాల్లో షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటారా అంటే చెప్పలేని పరిస్థితి. కరోనా దెబ్బకి ఆయా దేశాల్లో పర్యాటకంపై కూడా ప్రభావం చూపడం ఖాయం. ప్రేక్షకులకు ఆయా ప్రదేశాల అందాలు చూడటం కష్టం. కాకపోతే.. దేశీయంగా మన పర్యాటకం అభివృద్ధి చెందుతుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: