అటు బాలకృష్ణ , ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటా పోటీగా ఉన్నట్టే కనపడుతోంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య బాబు అభిమానులు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏమిటిరా బాబు అంటూ అర్ధం కాకుండా ఉన్నారు . ఏ రంగంలో రాణిస్తున్నారు అనేది కూడా అర్ధం కాని దుస్థితి లోకి వెళ్లి పోయారు వీరి అభిమానులు. బాలయ్య బాబు సంగతికి వస్తే హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నుకో బడ్డాడు . కానీ ఫిలితం చూస్తే నిల్ .
అటు రాజకీయాలని పట్టించుకోకుండా సినిమాలపై దృష్టి పెట్టాడు. పార్టీ కార్యకర్తలు మాత్రం గెలిపించిన ప్రజలకి కాస్తో కూస్తో చెయ్యడం మంచిది అని బాలయ్య బాబుకి చెప్పారు . ఒక మనిషిని పెట్టి అక్కడ పర్యవేక్షించమన్నాడు కానీ వారంలో రెండు మూడు సార్లైనా అక్కడికి వెళ్లడం లేదుట బాలకృష్ణ. అలానే ఈ మధ్య కాలం లో అనేక మంది టీడీపీ నాయకులూ పార్టీ మార్చేసిన బాలయ్య నోట మాత్రం ఒక్క మాట కూడా రావకపోవడం తో అభిమానులు తప్పు పడుతున్నారు.
అనేక విమర్శలు వినపడుతూనే ఉన్నాయి పార్టీని పట్టించుకోవడం లేదు బాలయ్య బాబు అని. ఇక్కడ ఈ హీరో స్థితి ఇలా ఉంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థితి కూడా దారుణం గానే ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్తే సినిమాలు చెయ్యనని చెప్పాడు.
కానీ టైం ఎక్కువగా ఉండడంతో సినిమాలలో నటించడం తప్ప ఇంక ఏ పనీ లేనందున అడుగు వేసాడు . రాజకీయాల్లో పవర్ స్టార్ కి స్థిరత్వం లేదని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే కూడా మెగాస్టార్ చిరంజీవికే కాస్త క్లారిటీ ఉంది అంటున్నారు..