ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కంటిమీద కనుకు లేకుండా చేస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు  మూడు లక్షల వరకు ఈ కరోనా మహ్మారి భారి పడ్డట్టు తెలుస్తుంది.  అయితే కరోనా వైరస్ పుట్టుకొచ్చిన చైనాలో మాత్రం ఇప్పుడు తగ్గు ముఖం పట్టిందంటున్నారు.  కానీ ఇటలీలో ప్రళయతాండవం చేస్తుంది.  ఇప్పటికి 4500 వేల మందిపైగా మరణాలు నమోదు అయినట్లు చెబుతున్నారు.   ఆ తర్వాత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఫ్రాన్స్ అంటున్నారు.  ఇతర దేశాల్లో కూడా కరోనా ప్రభావం బాగానే చూపిస్తుంది.  నేడు భారత దేశలో కరోనా వైరస్ ని కొద్దిలో కొద్దిగా అరికట్టే ప్రయత్నంగా అందరూ ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నారు.  

 

ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే.  ప్రధాని మోదీకి సెలబ్రెటీలు మద్దతు తెలుపుతున్నారు.  తాజాగా అరుంధతి ఫేమ్ సోనూ సూద్ తన చిన్ననాటి విషయాల గురించి మాట్లాడారు.  చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మాటల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నానని సినీ నటుడు సోనూసూద్‌ ఓ వీడియో పోస్ట్ చేశాడు. సబ్బుతో చేతులు బాగా శుభ్రం చేసుకోమని ఆమె చెప్పేదని, ఎందుకు బయట తిరుగుతుంటావని కసురుకునేదని, ఇంట్లో ఉండమనేదని చెప్పాడు. హాయ్‌, హలో ఎందుకు చెప్పుకుంటున్నారని, సలామ్‌, నమస్తే పద్ధతులు  మర్చిపోయారా? అని నిలదీసేదని తెలిపాడు.

 

అప్పుడు అమ్మ ఊరికే తనను ఇబ్బంది పెడుతుందని బాధపడేవాడినని.. కానీ ఇప్పుడు అదే మనిషికి ఎంతో ముఖ్యమని తెలుస్తుంది.  తుమ్ము, దగ్గు వస్తుంది కాబట్టి జేబులో ఎప్పుడు కర్చీఫ్‌ పెట్టుకోవాలని చెప్పేదని సోనూసూద్ గుర్తు చేసుకున్నాడు.   ప్రస్తుతం  ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కరోనాతో పోరాడుతోందని ఆయన చెప్పాడు.బడిలో తనకు పరీక్షలు జరుగుతున్నప్పుడు చాలా భయపడేవాడినని, భయపడొద్దని, అంతా సజావుగా జరుగుతుందని  మా అమ్మ  చెప్పేదని ఆయన చెప్పాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: