క్రేజీ స్టార్ రౌడీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఏమ‌యిపోయాడా అని అనుకుంటున్నారా... ఏంటి ఇంత జ‌రుగుతున్నా అస‌లు సౌండ్ లేదు ఎక్క‌డికెళ్ళాడ‌బ్బా అని ఆలోచిస్తున్నారా... ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా ముందే స్పందిస్తున్నాడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌ల సైనికుల స‌హాయ‌నిధి కోసం.. అలాగే కేర‌ళ వ‌ర‌ద‌ల సంద‌ర్భంగా స్పీడుగా స్పందించి ఆక‌ట్టుకున్నాడు. అయితే ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ భ‌యంతో వ‌ణికిపోతున్న వేళ రౌడీ హీరో స్పంద‌నే లేదు. క‌నీసం  సోష‌ల్ మీడియాలో కూడా ఒక మెసేజ్ వేయ‌ లేదు.

 

వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా విజ‌య్ సైలెంట్ అయ్యాడా? లేక పూరిజ‌గ‌న్నాథ్‌తో చేస్తున్న‌ `ఫైట‌ర్‌` చిత్రీక‌ర‌ణలో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఇంత‌టి సీరియ‌స్ ఇష్యూని ప‌ట్టించుకోలేదా? అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇదిలా వుంటే అంతా షూటింగ్‌ల‌ని ఆపేయ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ `ఫైట‌ర్‌` షూటింగ్ కూడా ఆపేశారు. పూరి కూడా ఆల్రెడీ ఇంట్లోనే నిర్బంధ‌మ‌యి ఉన్నాయి. మ‌రి దీంతో కావాల్సినంత ఖాలీ టైమ్ దొర‌క‌డంతో ఈ రౌడీ హీరో త‌మ్ముడితో క‌లిసి తాపీగా చెస్ అడుతూ కాల‌క్షేపం చేస్తున్నాడు. అంటే ఇంట్లోనే అన్న‌ద‌మ్ములిద్ద‌రూ కూడా తాపీగా కూర్చుని ఆడుకుంటున్నారు.

 

వ‌ర‌ల్డ్ మొత్తం కరోనా ధాటికి కుదేలైపోతుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం సోష‌ల్ మీడియాలో క‌రోనా వైర‌స్‌పై ఎలాంటి సందేశాలు ఇవ్వడం లేదు. మొద‌ట్లో తెలంగాణ ప్ర‌భుత్వం కోసం ఓ ప్ర‌క‌ట‌న‌లో పాల్గొని చేతులు దులిపేసుకున్నాడు. ఆ త‌రువాత కరోనా వైర‌స్‌పై ఎలాంటి మెసేజ్‌లు చేయ‌లేదు. ఎందుక‌బ్బా ఇంత సైలెన్స్ మెయిన‌టెయిన్ చేస్తున్నాడు. ఏమ‌యింది మ‌న రౌడీకి. ఇక ఈ హీరో వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ ఏం చేయాలో కూడా అర్ధం కాక అలా సైలెంట్‌గా కూర్చున్నాడేమో అని అనుకుంటున్నారు. పాపం క‌నీసం ఫైట‌ర్ చిత్ర‌మైనా హిట్ అయితే కొంత తేరుకుంటాడు లేదంటే ఈ రౌడి హీరోకి కాస్త క‌ష్ట‌మేమ‌రి. అస‌లే సినిమాలు ఫ్లాప్ అంటే దానికి తోడు నిర్మాత‌గా కూడా అవ‌తార‌మెత్తి అవి కూడా ప్లాప్‌లు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: