బాలక్రిష్ణ టాప్ హీరో. పైగా సీనియర్ కూడా. ఇపుడున్న సీనియర్ టప్ ఫోర్ లో కూడా బాలయ్య సీనియర్. అటువంటి బాలయ్య అంటే అందరికీ అభిమానం ఉంది. బాలయ్య సైతం తన సినిమాల్లేంటో తానేంటో అన్నట్లుగానే ఉంటారు. మరి బాలయ్య విషయంలో ఎవరూ కూడా నెగిటివ్ కామెంట్స్ అసలు చేయరు.

 

అలాంటిది బాలయ్య ఈ మధ్య హీరోయిన్ల విషయంలోనే కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుట. వారి నుంచి ఆయనకు సానుకూల స్పందన రాకపోగా ఏకంగా ప్రెస్ రిలీజ్ చేస్తూ తాము బాలయ్య సర్ మూవీలో నటించడం లేదని కుండబద్దలు కొడుతున్నారు. 

 

బాలయ్య బోయపాటి మూవీలోనే ఇలా జరుగుతోంది. ఈ మూవీలో మొదట హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను అనుకున్నారు. ఆ అమ్మడు బొద్దుగా ముద్దుగా బాలయ్యకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని బోయపాటి భావించారు. దాంతో ఆయన ఆమెను కాంట్రాక్ట్  చేయానుకునేలోగానే సోషల్ మీడియాలో ప్రచారం కావడం ఆ వెంటనే సోనాక్షి ట్విట్టర్లోనే ఏకంగా  ఒక మెసేజ్ పెట్టడం జరిగింది.

 

తాను బాలయ్య సర్ మూవీలో యాక్ట్ చేయడం లేదని, ఆ సినిమా గురించి తనను ఎవరూ అసలు అప్రోచ్ అవలేదని కూడా చెప్పుకుంది. దాంతో బాలయ్య ఫ్యాన్స్ మండిపోయారు. మా హీరో మీద ఇంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారా అని వారు గుస్సా అయ్యారు. అది సరేనని అనుకుంటే ఇపుడు అప్ కమింగ్ హీరోయిన్ అర్ ఎస్  100 హాట్ బాంబ్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా బాలయ్య సర్ మూవీలో తాను నటించడంలేదని చెప్పేసిందట. ఆమె కూడా ఓపెన్ గా  చెప్పడంతో మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ రగులుతున్నారు.

 

అసలు మా బాలయ్యతో మీకేమైంది అని విరుచుకుపడుతున్నారు. మా హీరోని తక్కువ చేస్తే ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్యకు ఇప్పటికీ అంజలి తప్ప వేరే హీరోయిన్ ఈ మూవీలో దొరకలేదని అంటున్నారు. సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా ఇపుడు నటించడంలేదని టాక్. చూడాలి మరి రెండవ హీరోయిన్ గా ఎవరు సెలెక్ట్ అవుతారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: