భారతదేశం నుండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రధాని మోడీ మార్చి 22 అనగా ఈరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అహర్నిశలు ఎంతో సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు ఇంకా ఇతర సిబ్బంది అధికారులకు పళ్లాలతో చప్పుళ్ళు చేస్తూ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలపాలని మోడీ పిలుపునిచ్చారు. అయితే తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ పిలుపుని బ్రహ్మాండంగా పాటిస్తూ అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కరెక్ట్ గా 5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ వైద్య సిబ్బందికి, పోలీసులకు అభినందనలు తెలిపారు. అల్లు అరవింద్ బోయపాటి శ్రీను, రాశి కన్నా, నిధి అగర్వాల్, మెగాస్టార్ చిరంజీవి, పూరి జగన్నాథ్, చార్మి, రాజశేఖర్జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చప్పట్లు కొట్టే కార్యక్రమం లో పాల్గొన్నారు. 

 

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఒక వీడియో అప్లోడ్ చేసి... వైద్య సిబ్బందికి, పోలీసులకు, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచే వర్కర్లకు, మీడియాకి పోలీసులకి అందరికీ సలాం చేస్తున్నాను అని పేర్కొన్నారు. 

 

 

 

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ట్విట్టర్ లో రామ్ చరణ్ చప్పట్లు కొడుతున్న దృశ్యాలకు సంబంధించిన ఒక ఈ వీడియోని అప్లోడ్ చేసి మోడీ నిర్ణయాన్ని కొడియాడుతూ భారత పౌరులం అయినందుకు గర్విస్తున్నానని చెబుతూ జై హింద్ అని పేర్కొన్నారు. 

 

 

 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చప్పట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొని... ట్విట్టర్లో తను గంట కొడుతున్న ఈ వీడియోని అప్లోడ్ చేసి... ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న నా అన్నదమ్ములకు, ఎమర్జెన్సీ సేవల అందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా సలాం అని చెప్పుకొచ్చారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: