చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలను ఏలేసింది. ఓ దశలో నెంబర్ హీరోయిన్ గా అందరు టాప్ హీరోల పక్కన కూడా నటించింది. అయితే రీసెంట్ గా తన తలుపు తట్టిన మెగాస్టార్ చిరంజీవి 152వ ప్రాజెక్టు ఆచార్యను కాదనుకుంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ ఏకంగా మెగాస్టార్ సినిమాను కాదనడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమయింది. త్రిష నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. కానీ.. మెగా ఫ్యాన్స్ వ్యతిరేకత వల్లే త్రిషను తీసుకోలేదనే వార్తలు కూడా ఉన్నాయి.

 

 

కారణాలు ఏమైనా.. తెలుగులో త్రిషకు ఇకపై అవకాశాలు రావడం కష్టమే అనుకుంటున్న తరుణంలో ఓ ఆఫర్ త్రిషకు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలింనగర్లో ఈ వార్త రౌండ్ అవుతోంది. మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ ప్రాజెక్టులో త్రిషను హీరోయిన్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తోన్న రవితేజ్ తన తర్వాతి ప్రాజెకట్ రమేశ్ వర్మతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఇప్పటికే సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా షెడ్యూల్స్ కన్ఫర్మ్ అయితే త్రిష డేట్స్ ఇవ్వడము ఆలస్యమని అంటున్నారు. మరి ఈ వార్తలపై టీమ్ నుంచి అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

 

 

సినిమాల్లోకి వచ్చి 17ఏళ్లు అయినా ఇంకా వన్నె తరగని గ్లామర్ త్రిష సొంతం. అయితే కొత్త హీరోయిన్ల రాకతో వెనుకబడిన త్రిషకు తమిళ్ లో సినిమాలు ఉన్నాయి కానీ తెలుగులో అవకాశాలు దాదాపుగా తగ్గిపోయాయి. తమిళ్ లో మాత్రం స్టార్ హీరోల పక్కన సినిమాలు లేకపోయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. విజయ్ సేతుపతితో త్రిష నటించిన 96 తమిళ్ లో భారీ హిట్. ఈసారైనా తెలుగు ఆఫర్ ను త్రిష చేస్తుందో లేదో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: