ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల మనుషులకు ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా కుంగదీస్తుంది.   కరోనా ఎఫెక్ట్ తో చైనాలోనే కాదు ఇటలీ, ఫ్రాన్స్ లో తీవ్ర స్థాయిలో మరణాలు సంబవిస్తున్నాయి.  ఈ మాయదారి కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ లో సైతం జనాలకు భయబ్రాంతులకు గురి చేస్తుంది.  ఇప్పటికే కరోనా వల్ల 325 భారిన పడ్డారు.  ఈ రోజు ఒక్కరోజు ముగ్గురు చనిపోయారు.  దేశంలో మొత్తం కరోనాతో మరణించిన వారి సంఖ్య ఏడుకి చేరింది.  అయితే కరోనా వల్ల ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది సినీ పరిశ్రమ.  ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమలన్నీ మూత పడే పరిస్థితికి చేరుకుంది.  షూటింగ్ లు అన్నీ ఆగిపోతున్నాయి.. ఎక్కడో అరకోర గా సాగుతున్నాయి. థియేటర్లు, మాల్స్ ఇప్పటికే మూసి వేశారు.  

 

 

 

 

కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమలో సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ఓ వైపు షూటింగ్ లేక ప్రతిరోజూ దానిపై ఆదారపడి జీవించేవారి కష్టాలు మామూలూగా లేవు.  ముఖ్యంగా హైదరాబాద్ లో కృష్ణానగర్ పరిస్థితులు ఎంతో దారుణంగా తయారయ్యాయి.  అక్కడ పేద కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. మరోవైపు టాలీవుడ్ నిర్మాత మండలి పేద కళాకారులకు చేయూత ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.  

 

 

 

 

కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా సినిమా షూటింగులు, టీవీ సీరియళ్ల చిత్రీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షూటింగులు రద్దవడంతో అనేకమంది పేద కళాకారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చిత్రపరిశ్రమకు చెందిన పేద కళాకారులు, పలు విభాగాలకు చెందిన కార్మికులకు ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆపన్నహస్తం అందించారు. వారికి పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇప్పుడు దేశం గడ్డు పరిస్థితిలో అందరూ ధైర్యంగా ఎదుర్కొవాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: