ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పేరెత్తితే చాలు ప్రాణ భయంతో వణికిపోతుంది. విరుగుడు లేని ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ఎంతో మందిని పొట్టనబెట్టుకుని...  ఇంకా ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా  చేస్తుంది. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు మొత్తం ఈ వైరస్ నిర్మూలనకు నడుం బిగించాయ. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇప్పటికే స్వీయ  నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. 

 


ఇక ఈ నేపథ్యంలోనే భారత్ కూడా స్వయ నిర్బంధం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాలు పూర్తిగా స్వీయ నిర్బంధంలో కి వెళ్లి పోయాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే కరోనా  వైరస్ ను  భారత్ నుంచి తరిమికొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జనతా కర్ఫ్యూ  ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. భారతదేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు వైద్య బృందాలు వైద్యం అందించినందుకు కృతజ్ఞతగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రతి ఒక్కరు తమ గుమ్మం వద్దకు వచ్చి చప్పట్లు కొట్టి   వారికి సంఘీభావం ప్రకటించాలని  ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. 

 


 అయితే తాజాగా దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పందించారు. ఏ దేవుడు మనల్ని కాపాడలేరు... అందుకే గుళ్ళు గోపురాలు అన్ని మూసేశారు. మనల్ని మనం మాత్రమే కాపాడుకోవాలి... అందుకే జనతా కర్ఫ్యూ  భాగంగా ఐదు గంటలకు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతాం.. గట్టిగా అరుద్దాం... అంటూ పూరి జగన్నాథ్ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: