ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ ప్రభావం భారత దేశంపై కూడా పడి భారత ప్రజలను ప్రాణ భయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. అయితే ఇప్పటికే ప్రజలందరూ కరోనా  వైరస్ నియంత్రణకు సహకరించాలని అంటూ  తెలంగాణ సర్కార్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగులు అన్ని వాయిదా వేస్తూ టాలీవుడ్ ఫిలిమ్ ఛాంబర్ నిర్ణయం తీసుకున్నది. దీంతో స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకూ అన్ని సినిమాలు చిత్రీకరణ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం అందరు హీరోలు ఇంటికే పరిమితం అయిపోయారు

 


 అయితే సినిమా అంటే హీరో హీరోయిన్లు మాత్రమే కాదు... ఆ సినిమా కోసం పనిచేసే దర్శకుడు,  సంగీత దర్శకుడు, టెక్నీషియన్లు, కార్మికులు, కళాకారులు ఇలా చాలా మంది సినిమాల పై ఆధారపడి బతుకుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగులు పూర్తిగా ఆగిపోవడంతో దర్శకుడు సంగీత దర్శకులు హీరోలు హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉన్నా... కిందిస్థాయి కార్మికులు,  పేద కళాకారుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిపోతుంది. ఉపాధి కరువవడంతో ఇంటి పోషణ కూడా భారంగా మారిపోతుంది. 

 

 అయితే ప్రాణాంతకమైన కరోనా  వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా షూటింగులు టీవీ సీరియల్ చిత్రీకరణ పూర్తిగా నిలిచిపోయింది. తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా షూటింగ్ లన్నింటిని మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్మికులు,  పేద కళాకారుల కష్టాన్ని హీరో రాజశేఖర్ అర్థం చేసుకున్నారు. దీంతో వారి పట్ల ఎంతో సానుభూతితో స్పందించారు హీరో రాజశేఖర్. చిత్ర పరిశ్రమకు చెందిన పేద కళాకారుల.. పలు విభాగాలకు  చెందిన కార్మికులకు హీరో రాజశేఖర్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆపన్నహస్తం అందించారు. వారికి పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ హీరో రాజశేఖర్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద కళాకారులకు కార్మికులకు సహాయం చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: