మహేష్ బాబు తండ్రి బిరుదు సూపర్ స్టార్ ని సొంతం చేసుకున్నారు. అయితే క్రిష్ణలా పక్క మాస్ హీరో గా కాక  ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. అలాగే  మహేష్ క్లాస్ టచ్ ఇచ్చే మాస్ హీరోగానే ఉన్నారింతవరకూ. ఆయన్ని మాస్ మసాలా స్టోరీస్ లో పెట్టాలని డైరెక్టర్లు అనుకున్నా కూడా ఎందుకో కుదరడంలేదు. మహేష్ సైతం ఒవర్సీస్ మార్కెట్ ని ద్రుష్టిలో ఉంచుకుని అవుట్ అండ్ అవుట్ మాస్ స్టోరీలకు  ఓటు వేయడంలేదని అంటున్నారు.

 

ఆయన లేటెస్ట్ హిట్ సరిలేరు నీకెవ్వరు మూవీ కూడా సెమీ మాస్ మూవీగా ఉంటుంది తప్ప కంప్లీట్ గా కాదు. రాబోయే సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే చేయాలని మహేష్ డిసైడ్ అయ్యాడుట. అందులో ఒకటి సోలో, గీతాగోవిందం వంటి హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ పరశురాం మూవీ అయితే, రెండవది చలో మూవీ తీసి తొలి హిట్ కొట్టి, ద్వితీయ విఘ్నం లేకుండా భీష్మతో భారీ హిట్ కొట్టిన వెంకీ కుడుమలతోనట.

 

ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పి స్క్రిప్ట్ మీద కసరత్తు చేస్తున్న పరశురాం ఓ వైపు ఉంటే, మరో వైపు కొత్తగా వెంకీ  కుడుమల జాయిన్ అయ్యాడుట. వెంకీ కుడుమల చెప్పిన స్టోరీ లైన్ కూడా బాగుందన్న‌ మహేష్ బాబు బాగా డెవలప్ చేయమన్నాడని టాక్. 

 

ఇలా ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్లలో ఎవరు తొందరగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తే వారితో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని మహేష్ బాబు అనుకుంటున్నట్లుగా టాక్. జూన్ నుంచి కొత్త సినిమా షూటింగ్ మొదలుపెడదామని మహేష్ బాబు ప్లాన్. మరి ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్లకు ఇపుడు సమ్మర్ టెస్ట్ మొదలైంది. ఎవరు నెగ్గుతారో చూడాలి. అపుడే మహేష్ జోడీ ఎవరో తేలుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: