ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. ఈ వైరస్ వల్ల చైనా దేశం కంటే ఎక్కువగా ఇటలీ దేశానికి చెందిన ప్రజలు బలైపోతున్నారు. కారణం చూస్తే ఆ దేశం ఇచ్చిన హెచ్చరికలను మరియు ఆదేశాలను పాటించకపోవడంతో ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఇండియాలో రాకూడదని ముందు చూపుతో, మోడీ మార్చి 22 నుండి 31 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో చాలా వరకు దేశంలో ఉన్న ప్రజలంతా ఇంటికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో చాలావరకు రోజు వారి జీవితాలను గడిపే పేదవారి బతుకులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ విషయంలో ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేదవారి పట్ల తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

 

సమాజం పై అనేక సార్లు, అనేక విధాలుగా బాధ్యత ఏంటో తెలియజేసిన ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ విషయంలో చాలా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలోపేదవాళ్లకు తన వంతు సహాయం చేయటానికి కీలక నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాలో ప్రకటించారు ప్రకాష్ రాజ్. ఆయన సోషల్ మీడియాలో చెప్పింది ఏమిటంటే...‘జనతా కర్ఫ్యూతో.. నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ, నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి కూడా ఆలోచించాను.

 

కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు. నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని... జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’అంటూ ప్రకాశ్‌ రాజ్ పిలుపునిచ్చారు. దీంతో ప్రకాష్ రాజ్ సమాజంలో ఉన్న పేదవారి పట్ల బాధ్యతగా మెలగటం తో చాలా మంది నెటిజన్లు ఆయన తీసుకున్న నిర్ణయానికి చేతులెత్తి దండం పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: