యాక్షన్ కింగ్ అర్జున్ అంటే తెలుగులో కూడా ఫేమస్ హీరో. ఎనభైల్లో మన్నెంలో మొనగాడు, మాపల్లెలో గోపాలుడు.. వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్ పలు సినిమాలు చేశాడు. మాస్ హీరోగా, కరాటే ఫైటర్ గా అర్జున్ కు మంచి క్రేజ్ ఉండేది. తమిళ్ లో స్టార్ హీరో కూడా. రీసెంట్ గా ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి, పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 

 

‘నా భార్య నివేదిత కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేసేది. నివేదిత తండ్రి రాజేశ్, మా నాన్న శక్తిదాస్ మంచి స్నేహితులు. డాక్టర్ గారి అబ్బాయి అనే తెలుగు సినిమా సమయంలో నాకు నివేదితతో పరిచయం. ఆ సినిమా సమయంలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేశాను. పెళ్లి సమయానికి నాకు 25ఏళ్లు.. నివేదికకు 17ఏళ్లు ఉంటాయి. నేను ఏ సినిమాలో నటించినా ఆ హీరోయిన్ తో చనువుగా ఉంటే తట్టుకునేది కాదు. సినిమాల్లో ఇలాంటివి సహజం.. నీకు తెలీంది ఏముంది అని చెప్పేవాడ్ని. అప్పటికి గానీ అర్ధం చేసుకునేది కాదు’ అంటూ తన ప్రేమ పెళ్లి నాటి ట్విస్ట్ చెప్పుకొచ్చాడు ఈ యాక్షన్ కింగ్.

 

 

జెంటిల్ మేన్, శ్రీమంజునాధ, హనుమాన్ జంక్షన్, రామ రామ కృష్ణ కృష్ణ.. వంటి పలు సినిమాల ద్వారా ఈమధ్య కూడా తెలుగు సినిమాల్లో నటించాడు. అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా పలు తమిళ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా నటిస్తోందనే ప్రచారం ఆమధ్య జరిగింది. దర్శకుడిగా కూడా అర్జున్ పలు సినిమాలను తెరకెక్కించాడు. ద్రోహి, జైహింద్, జైహింద్ 2.. వంటి పలు సినిమాలు తాశాడు. యాక్షన్ కింగ్ గా అర్జున్ కు మంచి పేరు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: