నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోలుగా మంచి ఫాం లో ఉన్నారు. తారక్ హీరోగా భారీ చిత్రాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కలిసి తారక్ నటిస్తున్న ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి 2021 కి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా తారక్ మరోసారి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

 

ఇక ఎన్.టి.ఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రాం అటు నిర్మాతగా ఇటు హీరోగా విజయవంతమైన ప్రయాణం చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ హీరోగా నటిస్తూనే తారక్ తో కూడా సినిమాలని నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రం తారక్ కాంబోని కూడా కళ్యాణ్ రాం తన బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు తారక్ అన్న కళ్యాణ్ రాం బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో  జై లవకుశ వంటి బ్లాక్ బస్టర్ వంటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

 

ఇక తారక్ కూడా కొత్త బ్యానర్ ని పెట్టబోతున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇతర వ్యాపారాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు సొంత వ్యాపారలతో పాటు సొంత బ్యానర్స్ లోను సినిమాలను నిర్మిస్తూ సక్సస్ లను అందుకుంటున్నారు. అదే ప్లాన్ లో తారక్ కూడా ఉన్నాడు. గత కొంతకాలం గా సొంత బ్యానర్ ని స్థాపించాలన్న ఆలోచన లో ఉన్న తారక్ తన తండ్రి పేరు మీద కొత్త బ్యానర్ ని స్థాపించి వరుసగా సినిమాలను నిర్మించబోతున్నాడు. ఇక తారక్ 31 వ సినిమా సొంత బ్యానర్ లోన ఉండబోతుందట. కళ్యాణ్ రాం బ్యానర్ లో తారక్ నటించగా ఇప్పుడు తారక్ సొంత బ్యానర్ లో కళ్యాణ్ రాం నటించబోతుండటం ఆసక్తికరమైన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: